డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన జగన్ ఇక నుంచి ఫ్రీ ఫ్రీ ఫ్రీ సంతోషం లో AP ప్రజలు

సంక్షేమ పథకాల అమలుతో పాలనలో దూకుడు పెంచుతున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జగన్ ఇప్పుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పాడు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం.. ప్రత్యేక యాప్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ…. మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలన్నారు.. అంతేకాదు ఓ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు అందచేస్తామని, త్వరలోనే ఈ పథకానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ పథకం ఉండేదని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపి వేసిందన్నారు. ఇప్పుడు మళ్ళి మా ప్రభుత్వం దీనిని మొదలుపెడుతుందని సీఎం జగన్ తెలియజేశారు. అలాగే డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తున్నామని గుర్తుచేశారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

అలాగే రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది మహిళలకు వచ్చే ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు రిజిష్ట్రేషన్ చేసి ఇవ్వనున్నామని చెప్పారు. నాడు-నేడు అనే కార్యక్రమంతో స్కూళ్ల రూపురేఖలు మార్చుతున్నామని, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ద్వారా పిల్లల జీవితాల్లో మలుపు తీసుకు వస్తున్నామని చెప్పారు. ప్రతి అడుగులోనూ మహిళలకు తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని, మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్లు క్రియేట్ చేసి, నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ గా ఇచ్చే పనుల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా చట్టం తెచ్చామని ఆయన చెప్పారు. అమ్మ ఒడి పధకం ద్వారా 42 లక్షల మంది తల్లుకు ఫించను అందిస్తున్నామని , తద్వారా 84 లక్షల మంది పిల్లల చదువుకు ఆర్ధిక సాయం అందుతోందని చెప్పారు. ఏపీ మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపరిచేందుకు ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే ఆవిర్భవిస్తుందని ప్రకటించారు.

ఈ నెలాఖరులోపు 18 దిశ పోలీస్ స్టేషన్స్ అందుబాటులోకి వస్తాయని, దిశ పీఎస్‌లలో అత్యధికంగా మహిళలే ఉంటారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో మూడు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి తెస్తామని, దిశ చట్టం విషయంలో రాష్ట్ర పరిధిలోని అన్ని అంశాలను నాలుగు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించడం గర్వంగా ఉందని ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. నేరస్థులతో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. ‘దిశ’ చట్టం దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలే తమ తొలి ప్రాధాన్య అంశమన్నారు. ఇలా ఆడపిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ తెలిపారు. మరి జగన్ చేసిన ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation