పాన్ కార్డు లేనివారికి గుడ్ న్యూస్.. వెంటనే ఈ వీడియో చూడండి

113

పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. పలు సందర్భాల్లో పాన్ కార్డు ఉపయోగపడుతుంది. ఇకపై పాన్ కార్డును క్షణాల్లో పొందొచ్చు. దీని కోసం కేంద్రం కొత్త విధానాన్ని తీసుకువస్తోంది.ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఆర్థిక పరమైన ట్రాన్సాక్షన్లు నిర్వహించాలన్నా పాన్ నెంబర్ అవసరం అవుతుంది.కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు, ఆధార్ కార్డుల ఇంటర్‌చేంజబుల్‌ను అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అంటే పాన్ కార్డు లేకపోతే దాని స్థానంలో ఆధార్ కార్డు ఉపయోగించొచ్చు…కేంద్రం పాన్ కార్డు జారీని మరింత సులభతరం చేయాలని భావిస్తోంది. అందుకే కొత్త విధానాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇందులో నిమిషాల్లోనే పాన్ కార్డు పొందే అవకాశముంది.

Image result for pan card

మోదీ సర్కార్ ఆన్‌లైన్‌లో పాన్ కార్డును నిమిషాల్లో అందించాలని భావిస్తోంది. దీని కోసం ఆధార్ వివరాలను ఉయోగించుకోవాలని చూస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ 2020లో పాన్ కార్డు జారీ అంశాన్ని ప్రస్తావించారు. ఆన్‌లైన్‌లో క్షణాల్లో పాన్ కార్డును అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని కోసం ఆధార్ కార్డు వివరాలు వినియోగించుకుంటామని ప్ర‌క‌టించారు.కొత్త విధానంలో పాన్ కార్డు కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆధార్ నెంబర్‌ ఉంటే సరిపోతుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే పాన్ కార్డు నెంబర్ వెంటనే వచ్చేస్తుంది. ఈ -పాన్ నెంబర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొత్త పాన్ జారీ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు సంబంధించి దాదాపు అన్ని సేవలను ఆన్‌లైన్‌ చేయాలని కేంద్రం భావిస్తోందని తెలిపారు..పాన్ కార్డు నెంబర్ జారీ కొత్త విధానం ఇప్పటికే రెడీ అవుతోందని . పని చివరి దశకు చేరుకుందని ఉన్న‌త అదికారులు చెబుతున్నారు. ఈ నెలలోనే ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంద‌ట‌. దీంతో ఇకపై పాన్ నెంబర్ క్షణాల్లోనే వచ్చేస్తుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇకపోతే ఆధార్ కార్డుతో పాన్ నెంబర్‌ను కచ్చితంగా లింక్ చేసుకోవాల్సిందే. ఇప్పటిదాకా 30 కోట్లకు పైగా పాన్ నెంబర్లు ఆధార్ నెంబర్లు అనుసంధానమయ్యాయి. ఇంకా 17 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ నెంబర్లతో లింక్ కావాల్సి ఉంది.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం పాన్, ఆధార్ లింక్ గడువును పొడిగిస్తూనే వస్తోంది. డిసెంబర్ చివరిలో కూడా ఈ రెండింటి అనుసంధాన గడువును మళ్లీ పొడిగించింది. 2020 మార్చి 31 కల్లా పాన్ కార్డు, ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాల్సిందే.ఆధార్‌తో పాన్ నెంబర్ అనుసంధానం చేసుకోకపోతే మీ పాన్ నెంబర్ చెల్లుబాటు కాకపోవచ్చు. అంటే పాన్ నెంబర్‌ బ్లాక్ అయ్యే ప్రమాదముంది. అందువల్ల పాన్ కార్డు ఎప్పటిలాగానే యథావిథిగా పనిచేయాలని భావిస్తే ఆధార్‌తో దీన్ని లింక్ చేసుకోవడం మంచిది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation