IRCTC : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్… కాశ్మీర్‌కు భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్

మీరు తక్కువ ఖర్చులో కాశ్మీర్ అందాలను చుట్టేసి రావాలని అనుకుంటున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం? భారతీయ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ‘భారత్‌ దర్శన్‌’ రైలు ఎక్కేస్తే సరి. చుక్‌ చుక్‌ రైల్లో వెళ్తూ కాశ్మీర్ అందాలను చూసే అరుదైన అవకాశాన్ని రైల్వే మీ ముందు ఉంచింది. తక్కువ ఖర్చుతోనే ఈ ప్రయాణాన్ని పూర్తి చేయొచ్చు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ – IRCTC శుభవార్త చెప్పింది. తిరుపతి నుంచి కాశ్మీర్‌ కు భారత్ దర్శన్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. ఢిల్లీ, శ్రీనగర్, గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, వైష్ణోదేవి లాంటి ప్రాంతాలు ఈ టూర్‌ లో కవర్ అవుతాయి. 11 రాత్రులు 12 రోజుల టూర్ ఇది. 2020 మే 27న ఈ టూర్ తిరుపతిలో ప్రారంభమవుతుంది. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రామగుండం, కాజిపేట్, నల్గొండ, సికింద్రాబాద్, నాగ్‌పూర్‌లో ఈ రైలు ఆగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకొని ఎక్కడైనా రైలు ఎక్కొచ్చు.

ఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌తో పాటు, ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, రీజనల్ కార్యాలయాల్లో టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ భారత్ దర్శన్ టూర్ ప్యాకేజీ స్లీపర్ క్లాస్ ధర రూ.19,215 కాగా, థర్డ్ ఏసీ ధర రూ.21,735. ప్యాకేజీలో రైలు ప్రయాణం, ధర్మశాలలు, డార్మిటరీల్లో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌తో పాటు సైట్ సీయింగ్ కవర్ అవుతాయి. ఐప్యాకేజీ బుక్ చేసిన తర్వాత 15 రోజుల లోపు క్యాన్సిల్ చేస్తే రూ.250 క్యాన్సలేషన్ ఛార్జీ ఉంటుంది. ఒకవేళ 8 నుంచి 14 రోజుల్లోపు క్యాన్సిల్ చేస్తే 25% క్యాన్సలేషన్ ఛార్జీ, 4 నుంచి 7 రోజుల్లోపు క్యాన్సిల్ చేస్తే 50% క్యాన్సలేషన్ ఛార్జీ వర్తిస్తుంది. టూర్‌కు 4 రోజుల ముందు క్యాన్సలేషన్ చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు.

Image result for IRCTC : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్… కాశ్మీర్‌కు భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్

ఇక కాశ్మీర్ కాకుండా వేరే ప్రాంతాలకు కూడా ఈ భారత్ దర్శన్ రైలు నుంచి ప్రయాణించవచ్చు. భారత్ దర్శన్ రైల్లో స్లీపర్ క్లాస్ కన్ఫార్మ్ టికెట్ లభిస్తుంది. కేవలం ప్రయాణానికే కాదు, వసతి సదుపాయాలు కూడా కల్పిస్తుంది. డిమాండు ఎక్కువగా ఉంటే.. ఈ రైలుకు ఏసీ కోచ్‌లను కూడా అందుబాటులోకి తెస్తుంది. చిన్న రైల్వే స్టేషన్లలో కూడా ఈ రైలు ఎక్కవచ్చు, దిగొచ్చు. ప్రయాణికుల భద్రత కోసం రైల్లో రక్షణ సిబ్బంది కూడా ఉంటారు. ఎల్టీయే ద్వారా కూడా మీరు ఈ రైలు ప్రయాణం చేయొచ్చు. ప్రయాణం తర్వాత రైల్వే మీకు ఎల్టీయే సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఈ యాత్ర టికెట్లను మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా ఏజెంట్ల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.

Content above bottom navigation