జగనన్న విద్యా వసతి దీవెన మీ ఖాతాలో ఒక్క రూపాయి పడిందా ? ఎప్పటి నుంచి ఇస్తారు ?

Jagan Vidya Deevena Vasathi Deevena Updates
Jagan Vidya Deevena Vasathi Deevena Updates

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు రంగం సిద్దమైంది. ఈ రెండు పథకాల వల్ల వెనుకబడిన ఎస్సి, ఎస్టీ, బీసీ, ఈబీసి, కాపు, మైనారిటీ సామాజిక వర్గాలతో పాటు దివ్యాంగులకు పోస్ట్ మెట్రిక్ స్కాలరషిప్ లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ ఆపై స్థాయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి కూడా స్కాలర్ షిప్ లు వర్తింప చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. వైఎస్సార్ నవశకం పేరిట విద్యార్థులకు ఫీజు రీఎంబర్సుమెంటు కార్డులు జారీ చేయనున్న ప్రభుత్వం తెలిపింది. నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలోకే నగదు జమ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ పథకం అమలుకు బాధ్యత వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేలు చెల్లించనున్నారు. డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి 20 వేల చొప్పున చెల్లించనున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలకు రెండు విడతలుగా ఈ నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఈ రెండు పథకాలకు 75 శాతం మేర హాజరు తప్పని సరి అంటూ నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు, కరస్పాండెన్స్, దూర విద్య, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు పొందిన వారికి ఈ పథకాలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ వసతిదీవెన, విద్యా దీవెన పథకాన్ని ఫిబ్రవరి 24 న విజయనగరంలో ప్రారంభిస్తున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. స్పందన సమీక్షలో ఆయన ఈ విషయం చెప్పారు. సంవత్సరానికి రూ.20వేల రూపాయలు రెండు దఫాల్లో ఇస్తాం.11,87,904 మందికి లబ్ధి. 53720 ఐటీఐ చదువుతున్న వారికి మొదటి దఫా రూ.5వేలు, ఏడాదికి రూ.10వేలు. పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి మొదటి దఫా రూ. 7,500వేలు, ఏడాదికి రూ.15వేలు. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న వారికి మొదటి దఫా రూ.10వేల రూపాయలు. ఏడాదికి రూ.20వేలు. విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తాం. ఇప్పటికే ఈ పథకం కోసం 1139 కోట్లు మంజూరు చేశామని సీఎం జగన్ తెలిపారు.

ఇక ఈ పథకాలకు సంబంధించి కార్డులు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే చాలామందికి ఈ కార్డులు ఇచ్చారు. ఒకవేళ మీకు కార్డు రాకుంటే మీరు మళ్ళి అప్లై చేసుకోండి. ఇక అలాగే కొంతమందికి అకౌంట్స్ లలో ఈ మధ్య ఒక్క రూపాయే పడింది అని అంటున్నారు. ఆ ఒక్క రూపాయే ప్రభుత్వమే వేస్తుంది. అకౌంట్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చెయ్యడానికి ఇలా ఒక్క రూపాయిని వేస్తుంది. కాబట్టి ఒక్క రూపాయే పడింది అని బాధపడకండి. మీకు పూర్తీ అమౌంట్ త్వరలోనే పడుతుంది. ఇక ఈ పథకాలకు అర్హత పొందాలంటే కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. పదెకరాల మాగాణి లేదా 25 ఎకరాల్లో మెట్ట భూమి ఉండవచ్చు. మాగాణి, మెట్ట భూమి కలిపి 25 ఎకరాలకు మించకూడదు. పారిశుద్ధ్య కార్మికులు మినహా మరే ఒక్క కుటుంబసభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్‌ అయి ఉండకూడదు. టాక్సీ, ఆటో, ట్రాక్టరు వంటివి తప్ప మరే సొంత నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉండకూడదు. పట్టణాల్లో 1500 చదరపు అడుగులకు మించి భవనం ఉండకూడదు. ఈ అర్హతలు ఉంటే జగనన్న విద్యా దీవెనకు అర్హులవుతారు. ఈ అర్హతలు ఉంటె మీరు ఈ పథకానికి అర్హులు.

ఈ క్రింద వీడియో చూడండి: