Jio కన్నా తక్కువకే BSNL 4G .. ప్రతిరోజు 3 GB

టెలికామ్ రంగంలో జియో ఒక సంచలనమే అని చెప్పుకోవాలి. జియో వచ్చిన తర్వాత టెలికం రంగం అంతా మారిపోయింది అనే చెప్పుకోవాలి. చాలామంది ఇతర నెట్ వర్క్స్ నుంచి జియోకు మారిపోయారు. దాంతో జియో పోటీని తట్టుకుని మార్కెట్లో పట్టు నిలుపుకునేందుకు పలు ప్రైవేటు టెలికమ్ ఆపరేటర్లు టారిఫ్ రేట్లను భారీగా తగ్గించి తమ ఖాతాదారులు ఇతర వాటికి మరలిపోకుండా ప్రయత్నిస్తున్నాయి. వీటికి పోటీగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త ఆఫర్ లను ప్రకటించింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని టెలికాం సంస్థ BSNL ఇప్పుడు ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు గట్టి పోటీ ఇవ్వడానికి వేగంగా పరుగులు తీస్తోంది. ఈ క్రమంలోనే జియోకు గట్టిపోటీ ఇవ్వడానికి కొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు రూ.998, రూ.1,999 ప్లాన్లకు కూడా కొన్ని మార్పులు చేసింది. అలాగే BSNL తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్లాన్ రూ.247 ఎస్టీవీ ప్లాన్. ఇది అన్ లిమిటెడ్ కాంబో ప్లాన్ కాబట్టి దీంతోపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. సాధారణంగా ఇవే లాభాలను రూ.186/రూ.187 ప్లాన్లతో కూడా అందిస్తుంది. కాకపోతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు అయితే , రూ.247 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు.. BSNL గత సంవత్సరమే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను అందించడం ప్రారంభించింది. ఈ అవకాశం MTNNL వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది. ఈ సౌకర్యాన్నే రూ.247 ప్లాన్ లో కూడా అందించనున్నారు. అయితే ఈ కాల్స్ పై ఎఫ్ యూపీని BSNL విధించనుంది. రోజుకు 250 నిమిషాల కాలింగ్ ను మాత్రమే BSNL అందిస్తుంది.

ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్లతో పోలిస్తే జియో అందించే లాభాలు తక్కువే. ఎందుకంటే ఈ నెట్ వర్క్ లు ట్రూలీ అన్ లిమిటెడ్ కాలింగ్ ను అందిస్తున్నాయి. అంటే ఈ నెట్ వర్క్ ల నుంచి ఉచితంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను చేయవచ్చన్న మాట. ఈ ప్లాన్ ను జియోకు కౌంటర్ ఇచ్చేందుకే BSNL విడుదల చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే జియో నెట్ వర్క్ ప్రీపెయిడ్ కేవలం 28 రోజులు మాత్రమే. ఈ మేరకు లాంగ్ టర్మ్ రీచార్జ్ ప్లాన్ల వ్యాలిడిటీని కూడా జియో 336 రోజులకు తగ్గించేసింది. ఇక డేటా లాభం విషయానికి వస్తే.. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభించనుంది. ఈ 3 జీబీ డేటా అయిపోయిన అనంతరం నెట్ స్పీడ్ 80 KBPS కు తగ్గిపోనుంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 100 SMS లను కూడా అందించనున్నారు.

BSNL తన రూ.998 ప్లాన్ కు కూడా మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ ప్లాన్ కూడా 30 రోజుల అదనపు వ్యాలిడిటీతో వస్తుంది. గతంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 240 రోజులుగా ఉండేది. ఇప్పుడు అదనపు వ్యాలిడిటీతో అది 270 రోజులకు చేరుకుంది. అయితే ఈ ఆఫర్ జూన్ 6వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అంటే మీకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీ కావాలంటే జూన్ 6వ తేదీ లోపు రీచార్జ్ చేసుకోవాల్సిందే. BSNL మార్పులు చేసిన మరో ప్లాన్ రూ.1,999 ప్లాన్. ఇప్పుడు ఈ ప్లాన్ తో రెండు నెలల పాటు ఈరోస్ నౌ కంటెంట్ ఉచితంగా లభించనుంది. ఈ ప్లాన్ తో లభించే లాభాల విషయానికి వస్తే.. రోజుకు 3 జీబీ డేటా లభించనుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతి రోజూ 100 నిమిషాలు వంటి లాభాలు కూడా లభించనున్నాయి. ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. చూశారుగా BSNL తీసుకొచ్చిన కొత్త ప్లాన్ వివరాలు. మిగతా నెట్ వర్క్స్ కంటే బెటర్ గా అనిపిస్తుంది కదా..

Content above bottom navigation