AP CM జగన్ తీసుకున్న 2 కీలక నిర్ణయాలు.. మే 1 నుంచి ఇచ్చే కొత్త సరుకులు ఇవే..!

ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఈ వైరస్ లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేస్తున్నారు… అంతేకాదు వారికి రేషన్ బియ్యం కందిపప్పు ఉచితంగా అందించారు, అంతేకాదు వైట్ రేషన్ కార్డ్ ఉన్న వారికి 1000 నగదు కూడా అందించారు.

అయితే రెండు విడతలుగా రేషన్ ఇచ్చింది ఏపీ సర్కార్, తాజాగా వచ్చే నెల రేషన్ కూడా అందించనున్నారు, ఇప్పుడు కూడా రేషన్ కూపన్ ఇచ్చి ఆ సమయం డేట్ ఇచ్చి ఆరోజు మాత్రమే రేషన్ ఇస్తామని చెప్పనున్నారు. వారు ఆరోజు తీసుకోవాలి.

పూర్తి వివరాలకు క్రింది వీడియో చూడండి

మే నెలలో కూడా రేషన్ అందించనున్నారు.. ఏపీలో ఇప్పుడు కందిపప్పు, పంచదార బియ్యం ఆయిల్ కూడా ఇవ్వనున్నారు అని తెలుస్తోంది, అంతేకాదు గత నెలలో చేసిన ఆర్దిక సాయం 1000 ఎలా చేశారో ఇప్పుడు కూడా మే నెలలో ఆర్దిక సాయం చేయనున్నారట, మే నెల మొదటి వారంలో ఆనగదు సాయం వస్తుంది అని తెలుస్తోంది.

ఇక ఈ నగదు సాయం ప్రతీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ కి అందిస్తారు, వైట్ రేషన్ కార్డ్ కూడా ఐదు రోజుల్లో ఇస్తామని గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలని ప్రభుత్వం చెబుతోంది.

Content above bottom navigation