కేంద్రం మరో కీలక నిర్ణయం 2 వేల రూపాయల నోటు రద్దు చేస్తారా ? షాక్ లో దేశ ప్రజలు..

Latest News About Rs.2000 Currency Note
Latest News About Rs.2000 Currency Note

2016 నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటించారు. అప్పటి వరకు వాడుకలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేశారు. ఆ స్థానంలో కొత్తగా రూ.2000 నోట్లు, రూ500 నోట్లను తీసుకొచ్చారు. దేశంలో నల్లధనాన్ని నిరోధించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే, నోట్ల రద్దు విఫల ప్రయోగం అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదంతా గ‌తం కాని త‌ర్వాత ఆ రెండు వేల నోటు కూడా క‌చ్చితంగా ర‌ద్దు అవుతుంది అని త‌ర్వాత మ‌ళ్లీ 1000 రూపాయ‌ల నోట్లు తీసుకువ‌స్తారు అని వార్త‌లు వ‌చ్చాయి.. దీనిపై కేంద్రం కూడా ఆనాడు స్పందించి ఇలాంటి ఆలోచ‌న ప్ర‌భుత్వం చేయ‌డం లేదు అని తెలిపింది. అప్ప‌టి నుంచి ఈ వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

తాజాగా మ‌ళ్లీ దేశ‌ వ్యాప్తంగా రూ.2000 నోటు బంద్ అవుతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్‌లో యూజర్లు దీనికి సంబంధించిన చర్చను జోరుగా జరుపుతున్నారు. త్వరగా రూ.2000 నోట్లను మార్చుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు.

దీనికి తగ్గట్టే ప్రముఖ ఐటీ నిపుణుడు, హైదరాబాద్‌కు చెందిన నల్లమోతు శ్రీధర్ కూడా దీనిపై తన ఫేస్ బుక్ ఖాతాల్లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ‘2000 రూపాయల నోట్లు గురించి ఇపుడు అన్ని బ్యాంక్ లకు సమాచారం వస్తోంది. నేను గంట క్రితం రాస్తే ఫేక్ న్యూస్ అన్న కొందరు బ్యాంక్ మేనేజర్ లు ఇప్పుడు appreciate చేస్తున్నారు …నేను ఆధారాలు లేనిదే ఎప్పుడూ ఏది రాయను. రేపటి నుండి ఏటీఎం లలో 2000 నోట్లు పెట్టరు. బ్యాంక్ లు కస్టమర్ లకు వాటిని ఇవ్వకూడదు. కేవలం డిపాజిట్ చేయొచ్చు అంతే అని ఆయన పోస్ట్ పెట్టారు.

కాని రెండు రోజులుగా ఏటీఎంల‌లో రెండువేల నోట్లు కూడా వ‌స్తున్నాయి, అయితే కేవ‌లం ఓ బ్యాంకులో మాత్ర‌మే ఆ ఏటీఎంలో ఈ రెండు వేల రూపాయ‌ల నోట్లు పెట్ట‌రు అనే వార్త‌లు వినిపించాయి. దానికి చాలా మంది మొత్తానికి ర‌ద్దు అవుతుంది అని భావించారు అని అధికారులు చెబుతున్నారు.

దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా ఎప్పటికైనా రద్దు చేస్తారనే అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది. కాని ప్ర‌స్తుతం ఇది న‌మ్మ‌కండి అని బ్యాంకు అధికారులు కూడా చెబుతున్నారు. దీని వ‌ల్ల మార్కెట్లో రెండు వేల రూపాయ‌ల నోటు ఇచ్చినా తీసుకునే ప‌రిస్దితి ఉండ‌దు అని ఇలాంటివి న‌మ్మ‌కండని చెబుతున్నారు, ఈనోట్ల ర‌ద్దు వార్త పూర్తి అవాస్త‌వం.

ఈ క్రింది వీడియో చూడండి:

Content above bottom navigation