భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఈ రోజు నుండే అమలు ధర ఎంతో తెలుసా ?

100

నాన్ సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ధరలు ఈ రోజు (12 ఫిబ్రవరి) నుండి పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత కొద్ది నెలల్లో ఇది ఆరో పెంపు. ఈ పెరిగిన ధరలు ఈ రోజు నుండే అమలులోకి వచ్చాయి.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇది ప్రతి రోజు దేశవ్యాప్తంగా 30 లక్షల ఇండేన్ సిలిండర్లను సరఫరా చేస్తుంది. 14.2 కిలో సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ఈ రోజు నుండి రూ.858.5గా ఉంటుంది. జనవరి 1వ తేదీన సిలిండర్ ధర రూ.144.5 పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.149 పెరిగి రూ.896, ముంబైలో రూ.145 పెరిగి రూ.829.5, చెన్నైలో రూ.147 పెరిగి రూ.881గా ఉంది. ఇండేన్ గ్యాస్ 11 కోట్ల మంది గృహాలకు గ్యాస్‌ను డెలివరీ చేస్తోంది.

ఢిల్లీలో జనవరి1వ తేదీన రూ.714, కోల్‌కతాలో రూ.747, ముంబైలో రూ.684.5, చెన్నైలో రూ.734గా ఉంది. ఇప్పుడు వివిధ నగరాల్లో రూ.144 నుండి రూ.149 వరకు పెరిగింది. ఫ్యూయల్ రిటైలర్స్ ప్రతి నెల ఎల్పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తారు.

భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధర ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎల్పీజీ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ రేటు, రెండోది రూపాయితో డాలర్ మారకం విలువ. ఈ రెండింటిపై గ్యాస్ ధర ఆధారపడి ఉంటుంది.

ఫ్యూయల్ రిటైలర్స్ ఎల్పీజీ సిలిండర్లను మార్కెట్ ధరలకు విక్రయిస్తారు. అయితే ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందిస్తుంది. 2020-21 బడ్జెట్‌లో కేంద్రం గ్యాస్, కిరోసిన్ వంటి వాటి సబ్సిడీ కోసం రూ.40,915.21 కోట్లు కేటాయించింది. కేవలం గ్యాస్ సబ్సిడీ కోసం రూ.37,256.21 కోట్లు కేటాయించింది. రూ.3,659 కోట్లు కిరోసిన్ కోసం కేటాయించింది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation