జగన్ సంచలన నిర్ణయం విద్యార్థులకు కొత్త పథకం డిగ్రీ కాలేజీలకు కూడా వర్తింపు

82

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. అయితే విద్యా వ్యవస్థలో మార్పు కోసం జగన్ అమ్మ వోడి, నాడు-నేడు పథకాలని ప్రవేశపెట్టారు జగన్. అయితే తాజాగా నాడు-నేడు కార్యక్రమం ఫై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. డిగ్రీ కళాశాలలకు కూడా నాడు-నేడు కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులతో, విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో వ్యాఖ్యానించారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిగ్రీ కళాశాలల అభివృద్ధి కోసం దాదాపు రూ. 1100 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం పాఠశాలల అభివృద్ధి కోసం ఫేజ్ 1 కింద ఈ నెల 15 వ తేదీ లోపు పనులు ప్రారంభించి జూన్ నెల లోపు పూర్తీ చేయాలనీ ఆదేశించారు. ఫేజ్ 2 కింద డిగ్రీ కళాశాలలను అభివృద్ధి చేసేందుకు జూన్ లేదా జులై లోపు పనులు ప్రారంభించేలా ఆదేశాలిచ్చారు. అయితే ఫీజులు మరియు విద్యా నాణ్యతలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని మంత్రి అన్నారు. అయితే ఫీజు రీఎంబెర్సెమెంట్ ఇబ్బంది లేకుండా ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఫీజు నియంత్రణ చేపడతామని మంత్రి అన్నారు. గోరు ముద్దలు కింద కొత్త మెను అమలులో నాలుగంచెల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

Content above bottom navigation