రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా రూ.6,318 కోట్లతో 42,12,186 మంది తల్లులకు దాదాపు 82 లక్షల మంది పిల్లలకు లబ్ధిచేకూరింది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫామ్స్, షూస్, సోక్స్ లు, స్కూల్ బ్యాగ్ సహా అన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే చెప్పారు, ప్రతి పాఠశాలలో భోదనా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ ప్రతి పాఠశాలలో నాడు – నేడు కార్యక్రమం కింద మౌలిక వసతుల కల్పనను దశల వారీగా చేపడతాం అన్నారు ఆ దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్.. అంతేకాదు ప్రతి పాఠశాల రూపు రేఖలు మారుస్తాం అన్నారు అలాగే చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యను ప్రవేశపెడతాం అన్నారు అలాగే ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని స్కూల్ పిల్లలందరికీ కూడా గొప్ప శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరొక మంచి అవకాశంతో పాటు గొప్ప శుభవార్త వినిపించారు. ఏపీలో స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా పాఠశాలల్లో బోధనని మరింతగా సులభంగా చేయడం కోసమని ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలల్లో డిజిటల్ విద్యకై ఒక స్మార్ట్ టీవీ ని అందజేయనున్నట్లు సమాచారం.
ఇకపోతే గోరుముద్ద మధ్యాహ్న భోజనంపై రూపొందించిన యాప్ కోసం ఆరా తీశారు సీఎం జగన్. దానితోపాటే జగనన్న విద్యా కానుక ద్వారా ఆరు రకాల వస్తువులు, మూడు జతల యునిఫామ్స్, నోట్ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్ ఇవ్వబోతున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒక కిట్ గా రూపొందించి అందించనున్నారు. దీనికి సంబందించిన మోడళ్లను కూడా అధికారుల సమక్షంలో చెక్ చేసి వివరించినట్లు సమాచారం. ఇకపోతే ఇవన్నీ కూడా నిర్దేశించిన సమయంలోనే స్కూలు పిల్లలందరికీ కూడా అందించాలని, దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కొత్తగా ప్రభుత్వ స్కూల్లో వచ్చే ఏడాది ఎవరు చేరాలి అని అనుకున్నా అందరికి
అడ్మిషన్లు దొరికేలా చూడాలి అని తెలిపారు.