కొత్త బియ్యం కార్డు అర్హుల లిస్ట్ 19 లక్షల కార్డ్స్ క్యాన్సల్ ఎలా చెక్ చేసుకోవాలి ? లిస్ట్ లో పేరు లేకపోతే ఏం చేయాలి ?

139

కొత్తగా వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందికి రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాల్సి ఉంది. అలాగే నవశకంలో భాగంగా చాలా మందికి రేషన్ కార్డులు కట్ అయ్యాయి.. కొత్తగా అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డులు కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంది, అయితే తాజాగా ఇటీవల నవశకం కూడా పూర్తి చేశారు అధికారులు.

ఇక రేషన్ కార్డులు కొత్తవి ముద్రిస్తారు అని అవి ఫ్రిబ్రవరి ఒకటి నుంచి అందిస్తారు అని వార్తలు వచ్చాయి.. ఈ సమయంలో
రేషన్ కార్డుదారులని నాలుగువిధాలుగా విభజించి అర్హుల లిస్ట్ విడుదల చేసింది .. వాటిని మున్సిపల్ కార్యాలయాలు అలాగే మండల ఆఫీసుల్లో అందరికి అందించనున్నారు, అయితే ఇది నేరుగా మునిసిపల్ కమీషనర్లకు అలాగే రెవెన్యూ అధికారులకు నేరుగా లాగిన్ అయి చూసే అవకాశం ఉంది అని తెలిపారు ఉన్నత అధికారులు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

రేషన్ కార్డులు జాబితాని నాలుగు రకాలు గా విభజించారు మరి ఆ నాలుగు జాబితాల అర్హులని ఎలా విభజించారో చూస్తే..

రేషన్ కు అర్హులు
అందుబాటులో లేనివారు
ఇతర జిల్లా వాసులు
జిల్లాలో ఉన్నా బయటవారు
ఇలా నాలుగు జాబితాలుగా వారిని విభజించడం జరిగింది.

వీటిని తర్వాత గ్రామ సచివాలయాల్లో కూడా నోటీసుల్లో పెడతారు, ఇందులో చూసి మీరు అర్హులు అయినా రేషన్ కార్డు పేరు రాకపోతే మళ్లీ మీరు అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించారు… ఇలా వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి మళ్లీ వారికి కొత్త కార్డు ఇవ్వనున్నారు, అయితే ఫ్రిబ్రవరి 1 నుంచి కొత్త కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం, అలాగే ఫ్రిబ్రవరి 20 తర్వాత గ్రామ సచివాలయాల్లో కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మరో అవకాశం ఇవ్వనున్నారు.. ఇక ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి ఉగాదికి కొత్త కార్డులు సాన్షన్ చేయనుంది జగన్ సర్కారు.

Content above bottom navigation