ఫోన్‌పేలోకి అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్‌…

ప్రముఖ ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్‌ ఫోన్‌పే తమ కస్టమర్లకు మరో అద్భుత అవకాశాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. సాధారణంగా ఎవరికైనా అమౌంట్ ట్రాన్సుఫర్ చేయగానే లేదా రిసీవ్ చేసుకోగానే ఫోన్ చేసి వచ్చింది లేదా చెబుతాము. ఫోన్ చేయకపోయినా మరో మార్గంలో కన్‌ఫర్మ్ చేస్తాం. తమ ప్లాట్ ఫాం ద్వారా ట్రాన్సాక్షన్స్ మరింత సులువుగా జరిగేలా కస్టమర్లకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ట్రాన్సాక్షన్స్ మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పే కస్టమర్లకు చాట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ చాట్ ఫీచర్ లో వినియోగదారులు చాట్ తో పాటు వారు చేసిన మనీ ట్రాన్సఫర్ హిస్టరిని కూడా చూసుకోవచ్చు. చాట్‌ పేరిట యూజర్లకు లభిస్తున్న ఈ ఫీచర్‌ సహాయంతో ఫోన్‌పే యాప్‌లో వారు తమ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికి మనీ రిక్వెస్ట్‌ పంపుకోవచ్చు. అలాగే వారికి డబ్బులు సులభంగా పంపించవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పుడు మరే ఇతర మెసేజింగ్ యాప్ అవసరం లేకుండా మని రిక్వెస్ట్ ఇంకా పేమెంట్ చేసుకోవచ్చు.

Image result for phone pay chating features

“ఫోన్‌పే చాట్ మా వినియోగదారులకు చాట్ చేస్తు వారు డబ్బును సులభంగా పంపడానికి సహకరిస్తుంది.ఫోన్‌పే యాప్ లో యూజర్ లావాదేవీల హిస్టరి చాట్ కూడా చూపిస్తుంది. ఇది చాలా ఆకర్షణీయమైన ఫీచర్ గా ఉపయోగపడుతుంది. ఒకవైపు చాటింగ్ చేస్తూనే అదే బాక్సులో ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు అని ఫోన్ పే సీటీఓ, సహా వ్యవస్థాపకుడు రాహుల్ చారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది చాట్ హిస్టరితో పాటు వారి లావాదేవీలను ట్రాక్ చేయడానికి వినియోగదారులను ఉపయోగకరంగా ఉంటుంది.”రాబోయే రోజుల్లో మేము గ్రూప్ చాట్ వంటి ఫీచర్లతో ఫోన్‌పే చాట్‌ను మెరుగుపరుస్తాము. ఇంకా వినియోగదారులకు వారి కాంటాక్ట్స్ ద్వారా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల నుండి డబ్బును పంపించడం లేదా పొందడం చాలా సులభం చేస్తుంది” అని రాహుల్ చారి తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్ కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ ఫోన్‌పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఫోన్‌పే యాప్‌లో ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి? అంటే.. యాప్‌ను ఓపెన్‌ చేసి కాంటా‍క్ట్‌ లిస్ట్‌ నుంచి సంబంధిత కాంటాక్ట్‌ నెంబరును ఎంచుకోవాలి. ఇక్కడ రెండు ఆప్లన్లు ఉంటాయి. 1. చాట్‌ 2. సెండ్‌. చాటింగ్‌ కోసం చాట్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. నగదు పంపడానికి సెండ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకొని, నగదును పంపొచ్చు. ఇలా మీకు కావాల్సిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే మీ ఫోన్ పే యాప్ ను అప్డేట్ చేసుకొని ఈ కొత్త ఫీచర్ ను పొందండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation