మోదీ కొత్త స్కీమ్… ఏకంగా రూ.2.67 లక్షలు ఇస్తుంది ఎలా Apply చేసుకోవాలి ? పూర్తి వివరాలు మీకోసం

167

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దీనిని సాకారం చేసుకునేందుకు అందరూ కష్టపడుతుంటారు. ఎంతో శ్రమించి, సమయం వెచ్చించి సరైన ఇంటి కోసం వెతుక్కుంటారు. మన జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లే. అయితే సొంత ఇల్లు కట్టుకోవడం అంత సులువైన పని కాదు. దీనికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. మన దగ్గర ఈ స్థాయిలో డబ్బులు ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు హోమ్ లోన్ తీసుకోవలసి వస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. అయితే మీకు ఇక్కడ మరో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం మీ సొంతింటి కలను నెరవేర్చుకోడానికి ఒక స్కీమ్‌ను అందుబాటులో తీసుకువచ్చింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌ ను 2015 జూన్ 25న లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోనే ఉంది. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లోని అందరికీ సొంతిల్లు అందుబాటులో ఉండేలా చూడాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద ఇల్లు కొనాలనుకునే వారికి సబ్సిడీ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం అందరికీ అందుబాటులో లేదు. ఇది కేవలం కొందరికి మాత్రమే వర్తిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వారు (EWS), మధ్యతరగతి వారు (MIGs), తక్కువ ఆదాయం (LIGs) ఉన్నవారికే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.3 లక్షల వరకు ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ కిందకు, రూ.3 నుంచి రూ.6 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వారు ఎల్ఐజీ కిందకు, రూ.6 నుంచి రూ.18 లక్షల ఆదాయం ఉన్న వారు ఎంఐజీ కిందకు వస్తారు. ఎంఐజీలో మళ్లీ ఎంఐజీ 1, ఎంఐజీ 2 అనే రెండు కేటగిరిలు ఉంటాయి. రూ.6,00,001 నుంచి రూ.12,00,000 మధ్యలో వార్షిక ఆదాయం ఉన్న వారు ఎంఐజీ 1 కిందకు వస్తారు. అదే 12,00,001 నుంచి రూ.18,00,000 మధ్యలో ఆదాయం ఉంటే ఎంఐజీ 2 కిందకు వస్తారు.

హోమ్ లోన్ కోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ కు వెళ్లాలి. సిటిజన్ అసెస్‌మెంట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఇందులో బెనిఫిట్ అండర్ద 3 కాంపొనెంట్స్ అనే ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ తర్వాతి పేజ్‌లో ఉంటుంది.. తర్వాతి పేజ్‌ లో లోన్ తీసుకునేవారు, వారి వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు కూడా అందించాలి. అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్‌ ను సబ్మిట్ చేయాలి. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, రీజినల్ రూరల్ బ్యాంక్‌ లు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రిజిస్టర్డ్ NBFC లు వంటి వాటి వద్దకు వెళ్లి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్బన్ లోకల్ బాడీస్ తో కూడా లోన్ కోసం అప్లై చేసుకునే అవకాశముంది. మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి లోన్ కోసం సంప్రదిస్తే మంచిది. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇన్కమ్ ప్రూఫ్, హౌస్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్, ఆధార్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ప్రయోజనం పొందాలంటే కుటుంబంలోని ఎవరి పేరుపై కూడా సొంతిల్లు ఉండకూడదు. లోన్ తీసుకొని కట్టుకునే ఇల్లు ఇంట్లోని భార్య పేరుపై ఉండాలి. లేదంటే భార్యాభర్తల పేరుపై జాయింట్‌ గా కూడా ఉండొచ్చు. అలాగే గరిష్టంగా 200 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాలో నిర్మించుకునే ఇళ్లకు మాత్రమే ఈ స్కీమ్ కింద సబ్సిడీ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద హోమ్ లోన్‌పై అర్హులైన వారికి గరిష్టంగా రూ.2.67 వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. రూ.6 లక్షల వరకు రుణ మొత్తంపై వడ్డీ సబ్సిడీ 6.5 శాతంగా ఉంటుంది. అలాగే రూ.9 లక్షల వరకు లోన్‌ పై వడ్డీ రాయితీ 4 శాతంగా ఉంటుంది. ఇక రూ.12 లక్షల వరకు రుణ మొత్తంపై వడ్డీ రాయితీ 3 శాతంగా ఉంటుంది.

ఎంఐజీ 1 కేటగిరిలోని అర్హత కలిగిన కస్టమర్లు రూ.9 లక్షల వరకు హోమ్ లోన్‌పై 5 శాతం వడ్డీ సబ్సిడీ పొందొచ్చు. అలాగే ఎంఐజీ 2 కేటగిరిలోని అర్హత కలిగిన కస్టమర్లు రూ.12 లక్షల లోన్‌పై 3 శాతం వడ్డీ సబ్సిడీ వస్తుంది. కొంత మంది బ్యాంకుల నుంచి ఇంకా ఎక్కువ మొత్తాన్ని లోన్ కింద పొందొచ్చు. అయితే వడ్డీ సబ్సిడీ మాత్రం పైన పేర్కొన్న రుణ మొత్తం వరకే లభిస్తుంది. ఉదాహరణకు ఎంఐజీ 2 కేటగిరిలోని అర్హత కలిగిన వారు రూ.36 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకుంటే.. అప్పుడు తొలి రూ.12 లక్షల రుణ మొత్తానికి వడ్డీ రేటులో 3 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇక మిగిలిన రూ.24 లక్షల లోన్ మొత్తంపై రెగ్యులర్ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఎంఐజీ 1 కింద రూ.2,35,068 వరకు, ఎంఐజీ 2 కింద రూ.2,30,156 వరకు సబ్సిడీ పొందొచ్చు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద హోమ్ లోన్‌పై డబ్ల్యూ‌ఎస్, ఎల్ఐజీ కేటగిరిలోని వారికి గరిష్ట ప్రయోజనం లభిస్తుంది. వీళ్లు రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ పొందొచ్చు. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కేటగిరి కిందకు వచ్చే వారికి వడ్డీ రాయితీ 6.5 శాతంగా ఉంటుంది. 20 ఏళ్ల లోన్ టెన్యూర్‌ వరకు ఇది వర్తిస్తుంది. కేవలం రూ.6 లక్షల వరకు రుణ మొత్తానికి మాత్రమే వడ్డీ సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన రుణ మొత్తానికి సబ్సిడీ ప్రయోజనం లభించదు. కాబట్టి ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఈ స్కీమ్ తో మీ కలను నెరవేర్చుకొండి ..

Content above bottom navigation