AP రైతులకు గొప్ప శుభవార్త చెప్పిన జగన్ సంతోషం లో ప్రజలు

60

అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా రైతులకు శుభవార్త అందించింది. వివిధ పథకాల కోసం పెండింగ్ ఉన్న బకాయి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రూ.2 వేల కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు తెలియజేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 8 వేల కోట్లలో, ఇప్పటికే రూ.6 వేల కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. బకాయి చెల్లింపుల కోసం ఆర్థికశాఖకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.4,500 కోట్లు రాకున్నా అప్పుచేసి మరీ రైతులకు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైందని వెల్లడించారు. గతంలో చంద్రబాబు పెండింగులో పెట్టిన రూ.960 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని తెలిపారు. ఇవ్వాల్సిన రూ.2వేల కోట్లే అయినా, అది అప్పు తీసుకొచ్చి క్లియర్‌ చేయమని ఆదేశాలిచ్చామని వెల్లడించారు. ఉద్యాన పంటలకు గిట్టుధర కల్పించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు. కొబ్బరి, అరటి, నీరి, టమాటో, ఉల్లి ఫుడ్ ప్రాసెసింగ్ పరిధిలోకి తీసుకురావాలని కూడా ఆదేశించారని చెప్పారు. ఇలాంటి పంటల విషయంలో రైతులకు మేలు జరిగేలా శాశ్వత పరిష్కారం చూడాలి. ఈ పంటల ఆధారంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి. అవి వచ్చేలోగా కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఏటా ఒక పంటను లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్‌ ఇబ్బందులు రాకుండా కార్యాచరణను అమలు చేయండి. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, అనుబంధ ఉత్పత్తులపై దృష్టి సారించాలి. ఆహార శుద్ధి పరిశ్రమలు, యూనిట్లు పెట్టి రైతులను ఆదుకోవాలి. అరటి, చీని, టమాటా, కొబ్బరి, ఉల్లి, మామిడి పంటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఒక్కో ఉద్యాన పంటను ఒక్కొ క్లస్టర్ కింద తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కోనసమీలో కొబ్బరి పార్క్ ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. పులివెందులలో అరటి పోస్ట్ హర్వెస్టింగ్ టెక్నాలజీ ఏర్పాటు సాధ్యసాధ్యాలను పరిశీలించాని సీఎం జగన్ ఆదేశించారని వివరించారు. మదనపల్లిలో టమాటోకు గిట్టుబాటు ధర కల్పించాలని సీఎం సూచించారని కన్నబాబు తెలిపారు. పట్టు పరిశ్రమలకు గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కన్నబాబు వివరించారు. పులివెందులలో ఐటీ కార్గో ఏర్పాటు చేస్తామన్నారు. కొబ్బరిలో వస్తోన్న వైరస్‌ ను నివారించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సాగవుతోన్న పంటలను విదేశాలను ఉత్పత్తి చేయడంపై సమావేశంలో చర్చకొచ్చిందని వివరించారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గ్రామ సచివాలయం నుంచి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనాల సరఫరా చేస్తామని మంత్రి కన్నబాబు వివరించారు.

Content above bottom navigation