ఏప్రిల్ లో రేషన్ కి ఫింగర్ ప్రింట్ అవసరం లేదు ఫింగర్ ప్రింట్ లేకుండా రేషన్ తీసుకోవడం ఎలా ?

137

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఏం చెప్పిందో… అదే చేసుకుంటూ పోతోంది. ఇంటింటికీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. గ‌త నెల‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌తీ ఒక్క‌రికి కొత్త రేష‌న్ కార్డు అందించాలి అని స‌రికొత్త కార్డులు తీసుకువ‌చ్చారు.. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా… ప్రతీ ఇంటి తలుపు తట్టి రేషన్ కార్డులు ఇస్తున్నారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఈ కార్డుల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు ఇవ్వబోతోంది. అలాగే… రేషన్ సరుకులు కూడా. ఇలా ఇళ్లకే తెచ్చి కార్డులు ఇస్తుండటంతో… లబ్దిదారులు ఎంతో ఆనందపడుతున్నారు. పేద ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది స‌ర్కార్.

అయితే ఇప్పుడు క‌చ్చితంగా మీరు బియ్యం రేష‌న్ స‌రుకులు తీసుకోవాలి అంటే బ‌యోమెట్రిక్ – ఫింగ‌ర్ థంబ్ ఇంప్ర‌షెన్ – సెన్సార్ సిస్టం పెట్టారు, అందులో వేలి ముద్ర వేస్తేనే మీకు రేష‌న్ వ‌చ్చేది.. కాని ఇప్పుడు క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆ వేలి ముద్ర‌లు వేస్తే ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతుంది అని దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు.

ఎవ‌రు వెళ్లి అయినా రేష‌న్ తెచ్చుకోవ‌చ్చు.. క‌చ్చితంగా కుటుంబ స‌భ్యుల‌లో ఒకరు వ‌స్తేనే రేష‌న్ ఇచ్చేవారు ..కాని ఇప్పుడు పూర్తిగా మార్చారు.. ఇక ఎవ‌రికైనా వ‌చ్చే నెల రేష‌న్ బియ్యం ఇవ్వ‌నున్నారు. దీంతో పెద్ద ఇబ్బంది ఉండ‌దు అని చెబుతున్నారు అధికారులు, ఇక ఇది క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గేవ‌ర‌కు అమ‌లు చేస్తార‌ట‌, త‌ర్వాత పాత విధానంతో కుటుంబ స‌భ్యుల‌కి మాత్ర‌మే ఈ రేష‌న్ బియ్యం పంపిణీ చేస్తార‌ట‌, తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

గ‌త‌ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరిగిందని, చాలా మంది అర్హులు కాని వాళ్లు తెల్ల రేషన్ కార్డులు కలిగి వున్నారని ..ఇప్పటి ప్రభుత్వం తేల్చింది… దీంతో అనర్హుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇది ఓ పట్టాన తేలకపోవడంతో… ఇలా కాదని అనుకున్న ప్రభుత్వం తాజాగా కొత్తగా రేషన్ కార్డు లబ్దిదారుల్ని గుర్తించి, వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇస్తోంది. అందువల్ల లబ్దిదారులు కచ్చితంగా కొత్త రేషన్ కార్డుల్ని పొందాల్సిందే అని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

Content above bottom navigation