రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కేవలం రూ.75 వేలకే..

ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏదైనా ఆన్ లైన ద్వారా అరచేతిలోనే అన్నీ కొనేయొచ్చు, అలాగే వస్తువులను, వాహనాలు కూడా క్షణంలోనే అమ్మేయొచ్చు. దీనిని కొందరు అదునుగా చేసుకొని జనాలని మోసం చేస్తున్నారు. రోజు కూడా ఆన్ లైన్ మోసాలను మనం ఎన్నో చూస్తున్నాం. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒక వ్యక్తికి ఎదురైంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మోటారు సైకిల్ అంటే ఇప్పుడు యువతరానికి ఎంతో మోజు. బులెట్ వాహనం మీద రయ్యిన దూసుకుపోవాలని కలలు కంటుంటారు. సరిగ్గా దానినే కాష్ చేసుకున్నాడో ఘనుడు. బులెట్ మోజుతో సొమ్ములు చెల్లించి మోసపోయి లబోదిబో అంటూ వాపోతున్నాడో యువకుడు. తాడేపల్లి రూరల్‌ పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌ యాప్‌ను నమ్ముకొని మోసపోయానని గ్రహించి చివరకు ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు.

Image result for రాయల్ ఎన్‌ఫీల్డ్‌

బాధితుడి కథనం మేరకు… మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్‌ఎక్స్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్‌ఎక్స్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫొటోతో పాటు ఫోన్‌ నెంబర్‌ 8168232398 ను పెట్టాడు. ఆ బైక్ ఆఫర్ చుసిన నాగం వెంకటేశ్వరరావు అది కొనుగోలు చెయ్యడానికి ఆసక్తి చూపాడు. ఆ వ్యక్తికి ఫోన్‌ చేస్తే, తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయిందని, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మబలికాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

మొదట గూగుల్‌పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్‌పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్‌పోర్ట్‌లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్‌ఎక్స్‌లో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్‌క్రైమ్‌ విభాగానికి కేసు అప్పగించారు. చూశారుగా ఆన్ లైన్ తో ఎలా మోసం చేశాడో. కాబట్టి ఆన్ లైన్ లో ఖరీదైన వస్తువులు కొనేముందు ఒక్కసారి ఆలోచించండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation