SBI నుంచి కొత్త స్కీమ్.. కేవలం ఒక్కసారి పెడితే ప్రతినెల రూ. 7400 వస్తుంది..

మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత నెలనెలా కొంత మొత్తం పొందాలనుకుంటున్నారా? మీలాంటివాళ్ల కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. నెట్ బ్యాంకింగ్, క్యాష్ విత్‌డ్రాయెల్, మనీ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చెక్ బుక్, లోన్స్ ఇలా పలు రకాల సర్వీసులు పొందొచ్చు. అలాగే SBI లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటే ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌. ఇప్పుడు ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుందాం.

SBI లో అకౌంట్ ఉన్న వారికోసం ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌ను కూడా అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా కస్టమర్లు ప్రతి నెలా కొంత మొత్తం పొందొచ్చు. దీని కోసం ముందుగా ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. డబ్బు డిపాజిట్ చేసిన అకౌంట్ హోల్డర్‌కు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. స్టేట్ బ్యాంక్ డిపాజిట్ చేసిన మొత్తంలో కొంతభాగాన్ని, డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీని కలిసి డిపాజిట్‌దారుడిని చెల్లిస్తుంది. డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ చెల్లింపు నెల రోజుల తర్వాతి నుంచి ప్రారంభమౌతుంది. అంటే మీరు నవంబర్ 8న డిపాజిట్ చేస్తే డిసెంబర్ 8న వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో కనీసం రూ.25,000 డిపాజిట్ చేయాలి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మాదిరి కాకుండా ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో ఎంత మొత్తాన్ని అయిన డిపాజిట్ చేయొచ్చు. ఇకపోతే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయగలడు.

Image result for కేవలం ఒక్కసారి పెడితే ప్రతి నెల రూ. 7400 వస్తుంది..

36, 60, 84, 120 నెలల కాలపరిమితితో ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ కింద డిపాజిటర్ నెలకు కనీసం రూ.1,000 పొందొచ్చు. ఎప్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లభించే వడ్డీ రేటే ఈ స్కీమ్‌కు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం 6.25 % శాతం వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్‌పై లోన్ సదుపాయం కూడా ఉంది. మీ డిపాజిట్‌లో ఉన్న బ్యాలెన్స్ నుంచి 75% వరకు లోన్ తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్రాంచ్ మేనేజర్ విచక్షణపై ఇది ఆధారపడి ఉంటుంది. లోన్ తీసుకున్న తర్వాత యాన్యుటీ పేమెంట్ లోన్ అకౌంట్‌లో డిపాజిట్ అవుతుంది. డిపాజిటర్ మరణిస్తే యాన్యూటీ మొత్తంలో మిగిలిన డబ్బులు వెనక్కి ఇస్తారు. కాబట్టి మీకు కూడా జాయిన్ అవ్వాలని ఉంటె వెంటనే ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి.

Content above bottom navigation