మీకు SBI ఖాతా ఉందా భయంకరమైన కొత్త రూల్స్ తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు ఈ రోజు నుంచే అమలు

ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ అంతా ఆన్ లైన్ మ‌యం అయింది
అందుకే మొబైల్ నెంబ‌ర్ తో అకౌంట్ లింక్ చేయ‌డంతో పాటు ఆన్ లైన్ కేవైసీని కూడా బ్యాంకులు తీసుకువ‌చ్చాయి.
కొంద‌రు ఖాతాదారులు ఇంకా కేవైసీ చేయించుకోలేదు
అందుకే దేశంలో అతి పెద్ద ప్ర‌భుత్వ బ్యాంకు ఎస్‌బీఐ ఒక పబ్లిక్ నోటీస్‌ను జారీ చేసింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) రూల్స్‌కు సంబంధించి దీన్ని ఇష్యూ చేసింది. బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరింది. కస్టమర్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్యాంకింగ్ సేవలను పొందొచ్చని తెలిపింది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఇలా కేవైసీ చేసుకోవ‌డానికి చివ‌రి తేదిగా స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు 2020 ఫిబ్రవరి 28ని డిక్లేర్ చేశారు. ఈలోపు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కస్టమర్లను కోరింది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు కేవైసీని పూర్తి చేసుకోకపోతే అప్పుడు కస్టమర్ల అకౌంట్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది.

కేవైసీ పెండింగ్‌లో ఉన్న ఖాతాలను కలిగిన కస్టమర్లకు ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్ కూడా పంపుతోంది. మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చి ఉంటే.. నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. మీకు ఇంకో వారం టైమ్ ఉంది. వెంటనే కేవైసీని పూర్తి చేసుకోండి.

స్టేట్ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిన బ్యాంక్ కస్టమర్లు అందరూ వారి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవలసి ఉంటుంది. దీని కోసం బ్యాంక్ ఖాతాదారులు ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్‌ను అందజేసి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే బ్యాంక్ అకౌంట్ రద్దవుతుంది. మీరు మీ ఖాతా నుంచి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరు. ఎలాంటి సేవలు కూడా పొందటం కుదరదు. అందువల్ల లేట్ చేయకుండా వెంటనే పనిని పూర్తి చేసుకోవడం మంచిది.

మీరు ఎస్‌బీఐ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే.. అప్పుడు మీ ద‌గ్గ‌ర ఈ డాక్యుమెంట్లు ఉంటేనే పని జరుగుతుంది. పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్‌ఈజీఏ కార్డు, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లెట‌ర్ ఇలాంటి డాక్యుమెంట్లతో సహా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో‌గ్రాఫ్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు అవసరం అవుతాయి. ఈ డాక్యుమెంట్లలో ఒక రెండు ఉన్నా పని జరిగిపోతుంది. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు వారి కేవైసీ అప్‌డేట్‌ను ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేసుకోవచ్చు. మ‌రి మీకు కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది వెంట‌నే ఈ ప‌ని పూర్తి చేయించండి.

Content above bottom navigation