SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్ భారీగా పెరిగిన ఛార్జీలు ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోండి లేదంటే చాలా నష్టపోతారు

చాలా మందికి బ్యాంకుల్లో లాక‌ర్లు ఉంటాయి.. ఇదే బంగారం న‌గ‌దు అన్నీ సేఫ్ గా దాచుకోవ‌డానికి బెట‌ర్ దారి అని ఫీల్ అవుతూ ఉంటారు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఈ విష‌యంలో షాకిచ్చింది. సేఫ్ డిపాజిట్ లాకర్ల చార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్‌బీఐ బ్యాంక్‌ లాకర్‌లో బంగారం ఆభరణాలు సహా ఇతర విలువైన వస్తువులను దాచుకోవాలని భావించే వారికి చుక్కలు కనిపించనున్నాయి. బ్యాంక్ లాకర్ రెంటర్ చార్జీల పెంపు వల్ల చాలా మందిపై నేరుగానే ప్రభావం పడనుంది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

స్టేట్ బ్యాంక్ తన లాకర్ వార్షిక చార్జీలను రూ.500 నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ స్మాల్ లాకర్ రెంటల్ చార్జీలు రూ.500 పెరుగుదలతో రూ.2,000కు చేరనున్నాయి. అదేసమయంలో ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ రెంటల్ చార్జీలు ఏకంగా రూ.3,000 పెరిగాయి. రానున్న రోజుల్లో వీటి చార్జీ రూ.12,000గా ఉంటుంది. ప్రస్తుతం ఈ లాకర్లపై వార్షిక చార్జీ రూ.9,000గా ఉన్న విషయం తెలిసిందే.. దీంతో ఒక్క‌సారి గా మూడు వేల రూపాయ‌ల రేటు పెరిగింది.

స్టేట్ బ్యాంక్ మీడియం సైజ్ లాకర్ రెంటల్ చార్జీలు కూడా ఎక్కువగానే పెరిగాయి. వీటిపై చార్జీలు రూ.1,000 పెరుగుదలతో రూ.4,000కు చేరాయి. లార్జ్ లాకర్ రెంటల్ చార్జీ కూడా రూ.2,000 పెరుగుదలతో రూ.8,000కు పెరిగింది. మెట్రో నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచుల్లో ఉన్న లాకర్లకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయి. ఈ ధరలకు జీఎస్‌టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అని ఎస్ బీ ఐ తెలిపింది.

ఇకపోతే స్టేట్ బ్యాంక్ పట్టణ, గ్రామీణ ప్రాంత బ్రాంచుల్లో లాకర్ చార్జీలను తక్కువగానే వసూలు చేస్తోంది. ఈ ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచుల్లో లాకర్ చార్జీలు రూ.1,500 నుంచి ప్రారంభం అవుతున్నాయి. గరిష్టంగా రూ.9,000 వరకు చార్జీలు పడతాయి. లాకర్ సైజ్ ప్రాతిపదికన చార్జీలు మారతాయి. మొత్తంగా చూస్తే.. ఎస్‌బీఐ అన్ని బ్రాంచుల్లో లాకర్ రెంటల్ చార్జీలు దాదాపు 33 శాతం మేర పెరిగాయి. 33 శాతం అంటే చాలా ఎక్కువగానే చెప్పుకోవచ్చు.

ఎస్‌బీఐ లాకర్ రెంటల్ చార్జీల పెంపు మాత్రమే కాకుండా బ్యాంక్ లాకర్‌లో ఏమైనా దాచుకోవాలని భావించే కస్టమర్లు ఇతర విషయాలను కూడా గమనించాలి. లాకర్ రెంటల్ చార్జీలతోపాటు ఇతర చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. వన్‌టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ చార్జీ కింద రూ.500 చెల్లించాలి. జీఎస్‌టీ అదనంగా చెల్లించాలి.

ఇకపోతే మీరు బ్యాంక్ లాకర్‌ తీసుకొని ఏమైనా అందులో దాచుకుంటే.. ప్రతి ఏడాది ఈ చార్జీలు చెల్లించుకోవలసి ఉంటుంది. మీరు ఒకవేళ లాకర్ రెంటల్ చార్జీల విషయంలో ఏమైనా ఆలస్యం చేస్తే.. అంటే నిర్ణీత గడువులోగా చార్జీలు చెల్లించకపోతే.. భారీ పెనాల్టీలు కూడా మోయాల్సి వస్తుంది. ఏకంగా 40 శాతం పెనాల్టీ పడుతుంది. అందువల్ల బ్యాంక్ లాకర్‌లో బంగారు నగలు సహా ఇతర డాక్యుమెంట్లను, వస్తువులను దాచుకోవాలని భావిస్తే.. మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.

స్టేట్ బ్యాంక్ కొత్త లాకర్ రెంటల్ చార్జీల పెంపు నిర్ణయం మార్చి 31 నుంచి అమలులోకి వస్తుంది… ఈలోపు బ్యాంక్ లాకర్‌ తీసుకుంటే ప్రస్తుత చార్జీలే వర్తిస్తాయి. అయితే ఏడాది తర్వాత మాత్రం మళ్లీ పెరిగిన చార్జీలు చెల్లించుకోవలసి ఉంటుంది. సో లాక‌ర్ ఉన్న వారు కొత్త‌గా తీసుకోవాలి అని అనుకునేవారు ఈ చార్జీలు గ‌మ‌నించుకోండి.

Content above bottom navigation