సిని పరిశ్రమలో విషాదం ప్రముఖ నటి మృతి కారణం తెలిస్తే కన్నిల్లె

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి నిమ్మీ మృతిచెందారు. ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన ఆమె గత రాత్రి ముంబైలో కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి పోతే..

అనారోగ్య సమస్యలు.. వృద్ధాప్యం నటి నిమ్మీ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. వయసు మీద పడటం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ముంబైలోని సర్లా నర్సింగ్ హోమ్‌లో.. ప్రస్తుతం నిమ్మి వయసు 88 సంవత్సరాలు. ఆమె అసలు పేరు నవాబ్ బానో. ఈ వయసులో ఆరోగ్య సమస్యలు తీవ్రతరం కావడంతో ఆమెకి గత కొన్ని రోజులుగా మెరుగైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారట. కానీ చివరకు ముంబైలోని సర్లా నర్సింగ్ హోమ్‌లో నిమ్మి మృతి చెందటం జరిగింది.

నిమ్మి కెరీర్ సంగతులు దివంగత నటుడు రాజ్ కపూర్ నిమ్మిని వెండితెరకు పరిచయం చేశారు. ఆయనే నవాబ్ బానోను నిమ్మీగా మార్చడం జరిగింది. రాజ్ కపూర్ మూవీ ‘బర్సాత్’తో సినీ గడపతొక్కిన ఆమె.. 1949 నుండి 1965 వరకు చాలా సినిమాల్లో నటించారు. హిందీ చిత్రసీమలో అదృష్టవంతురాలైన నటీమణిగా నిమ్మి పేరుగాంచింది.

నిమ్మి జన్మస్థలం..

సినిమాలు నిమ్మి ఫిబ్రవరి 18వ తేదీ 1933న ఉత్తరప్రదేశ్‌లోని ఫహేదాబాద్‌లో జన్మించింది. ఆమె తండ్రి అబ్దుల్‌ హకీమ్‌ మిలటరీ కాంట్రాక్టరు, తల్లి వహీదాబాయి మంచి గాయని, సినీ నటి. ”ఆన్, ఉడాన్ ఖటోలా, భాయ్ భాయ్, కుందన్, మేరే మెహబూబ్” లాంటి చిత్రాలతో నిమ్మి ఫేమస్ అయింది.

ప్రముఖుల సంతాపం

నిమ్మి మరణ వార్త తెలిసి బాలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు బాలీవుడ్ తారలు నిమ్మి మృతి పట్ల తమ తమ సంతాపం తెలుపుతున్నారు.

Content above bottom navigation