రాత్రికి రాత్రే భారీగా తగ్గిన బంగారం ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

60

గత ఆరు రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మళ్ళి తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30 తగ్గింది. దీంతో పసిడి ధర రూ.41,000 నుంచి రూ.40,970కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగింది. దీంతో ధర రూ.44,700 వద్దనే నిలకడగా ఉంది.. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఏకంగా రూ.1500 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.51,500 నుంచి రూ.50,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,970కు పడిపోయింది. వెండి ధర రూ.50,000కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం వెండి, బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి మార్పు లేదు. రూ.41,150 వద్దనే ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా రూ.39,950 వద్దనే కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.49,500కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర ఔన్స్‌కు 1.59 శాతం తగ్గుదలతో 1650.05 డాలర్లకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 2.99 శాతం తగ్గడంతో 18.31 డాలర్లకు చేరింది.

బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation