YSR పెన్షన్స్ ఫైనల్ లిస్ట్ విడుదల.. పెన్షన్ రానివాళ్లకు శుభవార్త..

136

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘ఇంటి వద్దకే పెన్షన్‌’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఫిబ్రవరి 1 న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా ఉ‍న్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అందజేసిన స్మార్ట్‌ ఫోన్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్‌ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. అయితే పెన్షన్ వచ్చినవాళ్లు ఆనందంగా ఉంటె పెన్షన్ రానివాళ్లు దిగులుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 లక్షల మంది పెన్షన్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఇందులో చాలామందికి పెన్షన్ రాలేదు. కేవలం 5 లక్షల మందికే పిన్షన్ వచ్చింది. దాదాపుగా 2 లక్షల మందికి పెన్షన్ రాలేదు. కరెంట్ బిల్లు , ఇన్కమ్ టాక్స్, గవర్నమెంట్ జాబ్స్..ఇలా రకరకాల కారణంగా చాలామందికి పెన్షన్ రాలేదు. ఇలా పెన్షన్ రానివాళ్లు ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అలా పెన్షన్ రానివాళ్ల కోసం రీ సర్వే చేశారు. ఇప్పుడు ఆ సర్వే కంప్లీట్ అయ్యింది.

అర్హత ఉన్నా వలంటీర్ల సర్వేలో కొందరికి పింఛన్లు తొలగించారంటూ పలుచోట్ల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో వాటిపై మరోసారి రీ సర్వే చేయించారు.. అలా తొలగించిన వారితో పాటు ఇటీవల కాలంలో పింఛన్లు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతనూ అధికారులు పరిశీలించారు. పింఛన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించిన కొత్త జాబితాలను ప్రభుత్వం శనివారం నుంచి సచివాలయ నోటీసు బోర్డుల్లో ఉంచింది. శని, ఆది, సోమవారాల్లో మూడు రోజుల పాటు విడతల వారీగా గ్రామ, వార్డుల వారీగా సోషల్‌ ఆడిట్‌ జరిపి, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలకు అనుగుణంగా, తుది జాబితాను ప్రకటిస్తుందని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. ఎంపికైన వారికి ఫిబ్రవరి నెలతో పాటు జనవరి నెల పింఛన్‌ను కలిపి.. 2 నెలల పింఛన్‌ను ఒకేసారి అందజేస్తారు. పింఛనుకు అర్హత ఉండీ ఇంకా ఎవరికైనా రాకపోతే అధికారులను సంప్రదించాల్సిన సమాచారాన్ని కూడా సచివాలయ నోటీసు బోర్డులో ఉంచారు.

పెన్షన్ రానివాళ్లు ఏం చెయ్యాలి అంటే.. ముందు మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్ళు ఉంటె వారి పేరును తీసెయ్యండి. అలాగే కరెంట్ బిల్లు 200 యూనిట్లు దాటితే రేషన్.. 300 యూనిట్లు దాటితే పింఛన్ కట్ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే వాళ్లకు కూడా పెన్షన్ రాదు. కాబట్టి మీరు అప్లై చేసిన ఫార్మ్ లో కరెంట్ బిల్లు మిస్టేక్ పడి ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి సంబందించిన 6 నెలల కరెంట్ బిల్లును తీసుకెళ్లి గ్రామా వాలంటీర్ కు ఇస్తే, వాటిని రెక్టిఫై చేసి మీకు పిన్షన్ వచ్చేలా చేస్తారు. ఇలా చేస్తే కేవలం 5 రోజుల్లోనే మీ పిన్షన్ మీకు వస్తుంది. కాబట్టి కరెంట్ బిల్లు, రేషన్ కార్డులో గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్లు, అలాగే ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్ళు ఉంటె వెంటనే తీసెయ్యండి. తప్పకుండ పెన్షన్ వస్తుంది. మరి మేము ఇచ్చిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

Content above bottom navigation