YSR ఆరోగ్య శ్రీ పథకం పై జగన్ మరో సంచలన నిర్ణయం అర్హతలు కూడా మార్చారు.. కొత్త రూల్స్..

75

సంచలనాలకు కేంద్ర బిందువు అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు వరాల మీద వరాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రుణాలు, పెన్షన్స్, ఇళ్ల పంపిణి లాంటి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు వరాలు ఇస్తున్న జగన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీపై శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి ఉండదు. రాష్ట్రంలోని 1.42 కోట్ల కుటుంబాలకు పైగా అంటే 95 శాతం కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య భరోసా కల్పించారు. దానికి సంబందించిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తూ ఈ ఏడాది జనవరి 3వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుతో పాటు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన మిగతా 1.41 కోట్లకు పైగా కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లను లబ్ధిదారుల ఇళ్లకే పంపించి కార్డులు పంపిణీ చేసి, అవి అందినట్లు రశీదులను కూడా స్వీకరించనున్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వాలంటీర్ల ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారికి కార్డును మంజూరు చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది.

ఇక ఈ ఆరోగ్యశ్రీ కార్డుకు కొన్ని ప్రామాణికాలు కూడా ఉన్నాయి. క్యూఆర్‌ కోడ్‌ బార్‌ కలిగిన కొత్త వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ స్మార్ట్‌ హెల్త్‌ కార్డులపై రేషన్‌ కార్డు నంబర్‌కు బదులు యునిక్‌ హెల్త్‌ గుర్తింపు నంబర్‌ ఉంటుంది. తద్వారా వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నమోదవుతుంది. కుటుంబ యజమాని పేరు తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. ఆ చిరునామాలో ఉంటున్న కుటుంబంలోని వారి పేర్లు కూడా ఉంటాయి. ఇంటి చిరునామా గుర్తింపు నంబర్‌ను కూడా ఇస్తున్నారు. కొత్త ఆరోగ్య శ్రీ కార్డులపై గ్రామ, వార్డు సచివాలయ కోడ్‌ లను ముద్రిస్తారు. ఇక వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాలకూ ఈ ఆరోగ్య శ్రీ గుర్తింపు ఉంటుంది. అధికారంలోకి రాగానే వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి వారికి సైతం లబ్ధి కలిగేలా ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో సైతం వైద్య సేవలు పొందేలా వీలు కల్పించారు. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు ఉంటుంది. లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి గుర్తిస్తారు.

Content above bottom navigation