AP లో మరో కొత్త పథకం ప్రవేశపెడుతున్న జగన్ YSR జయంతి రోజున ప్రారంభం సంతోషంలో ప్రజలు

ఏపీలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు కొత్త ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు, తాజాగా గ్రామీణ ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగు పర్చేలా కొత్త పథకం అమలులోకి తెస్తున్నారు. వైఎస్ ఆర్ విలేజ్ క్లినిక్స్ పేరిట ఈ పథకం అమలులోకి రానుంది..

జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున ఈ పథకాన్ని అమలు లోకి తీసుకొచ్చేలా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

వైఎస్ ఆర్ విలేజ్ క్లినిక్స్ పథకం ముఖ్య ఉదేశ్యం చూస్తే .. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండటం. ఈ మేరకు ప్రతీ రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున అన్ని గ్రామాల్లో గ్రామ వైద్యశాలలు ప్రారంభించి – అవి 24 గంటలు తెరిచి వుంచేలా ఈ పథకాన్ని రూపొందించారు సీఎం జగన్. ప్రతీ వైఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ లో రోజంతా (24 గంటల పాటు) ఒక బియస్సీ నర్సింగ్ చదివిన నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండేలా నమూనా రెడీ చేయమని సీఎం జగన్ వైద్య అధికారులను ఆదేశించారు.

గ్రామ సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక వైఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డబ్బు ఖర్చు కాకుండా ఉచిత వైద్య సేవలు అందించడమే గాక బేసిక్ మెడికేషన్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పని చేయాలని ఆయన సూచించారు.

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్య – ఆరోగ్యశాఖ పని చేయాలని చెప్పిన సీఎం.. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25 టీచింగ్ హాస్పిటల్స్ ఉండాలని అన్నారు. అదేవిధంగా వైఎస్ ఆర్ చిరునవ్వు పేరిట మరో పథకం రూపొందించాలని చెప్పారు, ఈ పథకంలో భాగంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి చదివే విద్యార్ధులకు ఉచిత దంత వైద్యం అందేలా నమూనా సిద్ధం చేయమని చెప్పారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ – వైఎస్ ఆర్ చిరునవ్వు పేరిట రూపకల్పన చేస్తున్న ఈ రెండు పథకాలను జులై 8న దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకురానుంది వైసీపీ ప్రభుత్వం.

ప్రతి విద్యార్థికి ఉచితంగా టూత్‌పేస్ట్, బ్రష్‌ అందించనున్నారు. వీరికి పీహెచ్‌సీలలో డెంటల్ చెకప్ చేయనున్నారు. 60 లక్షల మంది చిన్నారులకు స్క్రీనింగ్‌ చేయడమే లక్ష్యంగా ఏపీ సర్కారు ముందుకు సాగుతోంది. కంటివెలుగు తరహాలో కార్యక్రమం సజావుగా సాగేలా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Content above bottom navigation