AP మహిళలకు జగన్ శుభవార్త మరో నూతన పథకం ఈ రోజే మీకు రూ.15 వేలు డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతా లోకి ఈ సర్టిఫికెట్ ఉంటే చాలు

190

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక లోటుబాటులో ఉంది. దీనిని తగ్గించడానికి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తుంది. అయినా కూడా సామాన్య ప్రజలను ఆదుకోడానికి కొత్త కొత్త పథకాలను తీసుకొస్తుంది. ఇప్పటికే అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా వంటి ఎన్నో పథకాలను అందిస్తున్న ఏపీ ప్రభుత్వం కాపులకు కూడా ఆర్ధిక సాయాన్ని అందించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కాపులకు, అలాగే కాపు ఉప కులాలకు గుడ్ న్యూస్ అందించింది ఏపీ ప్రభుత్వం.. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఏపీ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ కులాలు, ఉపకులాలకు చెందిన మహిళలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాపు నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇక బీసీ డీ క్రిందకు వచ్చే తూర్పు కాపు సామాజిక వర్గాన్ని ఈ పథకానికి సంబంధించిన జీవోలో పేర్కొనలేదు. ఈ పథకం కింద కాపు, కాపు ఉప కులాల మహిళలకు ప్రతీ ఏటా రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. ఇక ఐదేళ్లకు రూ.75 వేలు ఆర్ధిక సాయాన్ని అందించాలని సర్కార్ భావిస్తుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ పథకం అమలు కోసం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ పథకానికి రూ. 1101.69 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇక వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే వారు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ12. వేలు ఆదాయం కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులు అని పేర్కొన్నారు. కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి లేదా 10 ఎకరాల్లోపు మెట్ట భూమి , రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలని నిర్ణయించారు. 45-60 వయసు ఉన్న వారు అర్హులు.

ఉద్యోగులు అనర్హులు కానీ పారిశుధ్య ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంది. ట్యాక్సీ, మినీవ్యాన్‌ , ఆటో , ట్రాక్టర్ లాంటి వాహనాలను జీవనోపాధి కోసం వినియోగించేవారికి మినహాయింపు ఉంది. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్‌ తీసుకుంటున్నా కాపు నేస్తం పొందడానికి అర్హులే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఈ ఏడాది మార్చి నుండి 2024 మార్చి వరకు కాపు , కాపు ఉప కులాల మహిళలకు ఈ ఆర్ధిక సాయం అందించనున్నారు. ప్రభుత్వ పెన్షన్‌ పొందుతున్న వారు కూడా కాపు నేస్తం పథకానికి అర్హులు కాదు. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తుంటే.. వారు అనర్హులు. ఇక కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు . ఇక కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే కూడా అనర్హులుగా పేర్కొన్నారు . ఇక ఈ పథకం కింద లబ్ధిదారులను గ్రామ, వార్డు వాలంటీర్లు ఎంపిక చేస్తారు. వారు ఇంటింటా సర్వే చేసి గుర్తిస్తారు. ఇక అర్హుల జాబితాను గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ లలో సోషల్ ఆడిట్ చేసి లబ్దిదారులను నిర్ణయిస్తారు. ఇక ఆ తర్వాత డబ్బులు ఖాతాలో పడగానే ఫోనుకు మెసేజ్ వస్తుంది. ఇక ఈ పథకం అమలు కోసం ప్రత్యేక పోర్టల్‌ ను ఏర్పాటు చేసి అన్ని వివరాలను అందులో పొందుపరచనున్నారు. దీంతో కాపు, కాపు ఉప కులాల ప్రజలకు ఆర్ధిక భరోసా అందనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కాపులకు, కాపు ఉప కులాలకు ఆర్ధిక సహాయం అందించాలని తీసుకున్న నిర్ణయంతో కాపులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Content above bottom navigation