YSR పెన్షన్ కానుక ఫైనల్ లిస్ట్ విడుదల అదనంగా మరో 3 లక్షల మందికి అర్హత వీరికి వచ్చే నెల రూ. 7,500/- పెన్షన్ ఇలా చెక్ చేసుకోండి

66

ఏపీలో రేషన్ కార్డుకు మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్డులకు లింక్ లేకుండా ఏ పథకానికి ఆ పథకానికే కార్డులు మంజూరు చేస్తుంది ఏపీ సర్కార్ . రాష్ట్రంలో పింఛను పొందే లబ్ధిదారులందరికీ ప్రత్యేక పెన్షన్‌ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో పాటు ఇప్పటికే ఏపీలో పించన్ తొలగించారని ఆందోళన నెలకొన్న నేపధ్యంలో మరోసారి లబ్దిదారుల విషయంలో రీ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రీ స‌ర్వే చేశారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

అంతేకాదు ఎవ‌రికి ఫించ‌న్ పోయిందో వారికి అర్హ‌త‌లు ఏమి ఉన్నాయో.. ఆ డాక్యుమెంట్లు స‌బ్ మీట్ చేయాలని తెలిపారు…ఇలా పించ‌న్ కోల్పోయిన వారు చాలా మంది ప్ర‌భుత్వానికి మ‌ళ్లీ అప్లై చేసుకున్నారు.. ఎందుకు లిస్ట్ నుంచి తొల‌గించారో కార‌ణం చూసి వారికి నిజంగా అర్హ‌త ఉంటే వారికి మ‌ళ్లీ పించ‌న్ ఇవ్వాలి అని భావించారు అధికారులు.

మొత్తం మ‌రోసారి న‌వ‌శ‌కం రీ స‌ర్వే ద్వారా చేసి.. మ‌రో 3 ల‌క్ష‌ల మందికి పించ‌న్ అందించాల‌ని తేల్చారు, వీరు అర్హులు అని భావించారు, దీంతో వారికి మ‌ళ్లీ పించ‌న్ అందించ‌నున్నారు…. ఈ మూడు ల‌క్ష‌ల మందికి జ‌న‌వ‌రి పించ‌న్ వ‌చ్చింది.. కాని ఫిబ్ర‌వ‌రిలో మాత్రం రాలేదు.. అయితే కొత్త‌గా మూడు ల‌క్ష‌ల మందికి పించన్ అందించ‌నున్నారు, వీరికి ఫ్రిబ్ర‌వ‌రి మార్చి రెండు నెల‌ల పించ‌న్ గ్రామ వాలంటీర్లు అందించ‌నున్నారు.

ఏపీలో నిరుపేదలైన వారికి అందించే వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది . కొత్తగా పెన్షన్‌కు అనుమతి లభించినవారికి పెన్షన్ బుక్‌తో పాటు ఐడెంటిటి కార్డు కూడా ఇస్తున్నారు, ఇక తాజాగా కొత్త పించ‌న్లు కోసం అప్లై చేసుకున్న‌వారు సుమారు 1.50 ల‌క్ష‌ల మంది ఉన్నారు అని అధికారులు చెప్తున్నారు . పాత పెన్షన్‌దారులందరికి గతంలోనే పెన్షన్ పుస్తకాలు అందజేసిన నేపథ్యంలో వారికి గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తున్నారు.
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసింది. సో మీరు అర్హులు అయితే క‌చ్చితంగా పించ‌న్ పొందండి.

Content above bottom navigation