కొత్త పెన్షన్ కార్డ్స్ వచ్చేసాయి మీకు కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు ? ఎక్కడ తీసుకోవాలి ?

257

ఏపీలో ఈ నెల పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి , అందులో ముఖ్యంగా నేటి నుంచి. కొత్త రేషన్ కార్డులు కూడా అందిస్తున్నారు..లబ్దిదారులకు ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులు అందజేయనుంది జగన్ సర్కార్ . వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54లక్షల 68వేల 322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వారందరికి నేటి నుంచి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు వాలంటీర్ల ద్వారా కొత్త ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేయనున్నారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఫిబ్రవరిలో కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి పింఛను పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు ఇస్తారు. పాత పింఛనుదారులకు ఇప్పటికే పెన్షన్ పుస్తకాలు పంపిణీ చేసిన కారణంగా వారికి కొత్తగా కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే ఇవ్వనున్నారు. అనర్హులుగా తేలిన వారికి సంబంధించి ప్రస్తుతం రీ సర్వే జరుగుతోంది. ఇందులో అర్హులుగా తేలిన వారికి మార్చి 1వ తేదీన గుర్తింపు కార్డులు ఇస్తామని అధికారులు చెప్పారు. పెన్షన్ బుక్, గుర్తింపు కార్డుల విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే గ్రామ లేదా వార్డు వాలంటీర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

చాలామంది పెన్షన్లు తీసివేశారని ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మరోసారి రీ సర్వే జరిపి, అర్హులైన వారిని తొలిగించినట్లయితే.. వారిని తిరిగి జాబితాలో చేర్చి.. మార్చిలో 2 నెలల పెన్షన్ కలిపి ఇవ్వాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్తగా 6లక్షల 14వేల 244 మందికి పెన్షన్లు మంజూరు చేసింది.

కొత్త పెన్షన్ కార్డుని ఓసారి పరిశీలిస్తే..
కార్డుపైన ఒక వైపు సీఎం జగన్, ఆయన తండ్రి వైస్ బొమ్మలు ఉన్నాయి.
నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని రాసి ఉంది.
వెనుకవైపు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని రాసుంది.
కార్డుకి రెండు వైపుల కింద భాగంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అని ఉంది.

కార్డులో ఉన్న వివరాలు ఇవే:
గ్రామ/వార్డు సచివాలయము:
గ్రామ/వార్డు సచివాలయము సంఖ్య:
పెన్షన్ ఐడీ నెంబర్:
పెన్షన్ రకం:
పేరు:
పుట్టిన తేదీ/వయస్సు:
భర్త/తండ్రి:
గ్రామం/వార్డు:
మండలం/మున్సిపాలిటీ:
జిల్లా:
ఆధార్ నెంబర్:
రైస్ కార్డు నెంబర్:
ఫోన్ నెంబర్:

ఇలా పూర్తి వివరాలతో కార్డులు అందిస్తున్నారు, కచ్చితంగా ఈ కార్డు మీకు ఉండాలి… అర్హులకి రాకపోతే వెంటనే గ్రామ వాలంటీర్ ని అడిగి సంప్రదించండి.

Content above bottom navigation