ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం మీకు కూతురు ఉందా ? అయితే రూ.1,50,000 మీ బ్యాంక్ ఖాతా లోకి అందరికీ వస్తుంది

పేదింటి యువతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 22 నెలలగా ఎదురు చూస్తున్న జంటల వ్యక్తిగత అకౌంట్లలలోకి డబ్బులు జమకానున్నాయి. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ తర్వాత అర్హత సాధించిన వారికి డబ్బులు విడుదల జమవుతాయి. ఇక పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేసేందుకు జగన్‌ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచి పథకాన్ని సరికొత్తగా వైఎస్సార్‌ పెళ్లి కానుకగా మార్చారు. పెంచిన నగదును రానున్న శ్రీరామ నవమి నుంచి అమలు చేయనున్నారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుక కింద అందజేశారు. పెంచిన ప్రోత్సాహకం ప్రకారం వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద వారందరికీ లక్ష రూపాయలు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేలను ఇప్పుడు రూ.1.20 లక్షలు చేశారు. బీసీ యువతులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు.. కులాంతర వివాహాలు చేసుకొనేవారికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు.. దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రోత్సాహకాలను పెంచారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుకను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఏకంగా ఐదు రెట్లు పెంచి రూ.20 వేల నుంచి రూ.లక్షకు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారి కూతుర్లకు కూడా పెళ్లి కానుకను అమలు చేస్తున్నారు.

ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికు కుటంబాలకు సాయం చేస్తున్నా, వారు అవగాహన లోపంతో సాయానికి దూరమవుతున్నారట. భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొనే వారి సంఖ్య తక్కువగా ఉన్నారట.. ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 52 జంటలు మాత్రమే పెళ్లి కానుక దరఖాస్తు చేసుకున్నారట. భవన నిర్మాణ కార్మికులు దగ్గర్లోని ఆసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు, తగిన రుసుం చెల్లించి గుర్తింపు కార్డు పొందవచ్చని ఆధికారులు చెబుతున్నారు. గుర్తింపు కార్డు వచ్చిన వారు పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరెవరు ఇంకా పెళ్లి కానుకను అప్లై చేసుకోలేదో వాళ్ళు వెంటనే అప్లై చేసుకుని పెళ్లి కానుకను పొందండి.

Content above bottom navigation