ఏపీలో నెలకి ఓ సంక్షేమం పథకం అమలు చేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత నెలలో జగనన్న వసతి దీవెన ప్రారంభించారు. పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం పెట్టేలా జగనన్న గోరుముద్ద ప్రవేశపెట్టారు. తాజాగా జగనన్న విద్యాకానుక పేరుతో జూన్ 1నుంచి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.1,350 విలువైన విద్యాకిట్ ఇచ్చే కొత్త పథకాన్ని అమలులోకి తెస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

ఈ విద్యాసంవత్సరంలో 36.10లక్షల మంది పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్‌తో పాటు మూడుజతల యూనిఫాంలు, బూట్లు, రెండు జతల సాక్స్‌తో కలిపి విద్యాకిట్ అందిస్తారు.
ఈ పథకం పేరు : జగనన్న విద్యా కానుక
2020 జూన్ 1నుంచి ఇది అమలు చేస్తారు
36.10లక్షల మంది విద్యార్థులకు ఈ కానుక అందనుంది
స్కూల్ బ్యాగ్, టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, 3 జతల యూనిఫాంలు, బూట్లు, 2 జతల సాక్స్‌తో కలిపి విద్యాకిట్ అందిస్తారు.
తాజాగా ఈ పథకం పై అధికారులతో జగన్ సమావేశం నిర్వహించారు…జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆరు రకాల వస్తువులు విద్యాకానుకలో ఉండనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా విద్యాకానుకకు సంబంధించిన నమూనాలను జగన్‌కు అధికారులు చూపించారు.. విద్యార్థులకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు. ‘నాడు-నేడు’ తొలివిడతలో భాగంగా 15,715 పాఠశాలల్లో జూన్ నాటికి పనులు పెండింగ్‌లో ఉండకూడదని జగన్ ఆదేశించారు.
నెక్ట్స్ మీటింగ్ సమయానికి అన్నీ పూర్తవ్వాలనీ, ఏవైనా పెండింగ్ ఉంటే… ఆ మీటింగ్‌లో తనకు చెప్పాలని అన్నారు. ఏం చేసినా జూన్ లోపే పూర్తవ్వాలన్నారు. జూన్‌లో స్కూళ్లు తెరవగానే విద్యార్థులు ఫుల్ హ్యాపీ అయ్యేలా చెయ్యాలన్నారు. మధ్యాహ్న భోజనం అదిరిపోవాలనీ, స్కూళ్లలో టాయిలెట్లు చూస్తేనే వావ్ అనిపించేలా ఉండాలనీ చెప్పారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఏ బిల్లులూ పెండింగ్ పెట్టకండి. పెడితే… విద్యార్థులకు నాణ్యత తగ్గించే ప్రమాదం ఉంది అని సీఎం జగన్ చెప్పారు.
ఇకపై ప్రతీ స్కూలుకూ స్మార్ట్ టీవీ ఇవ్వాలన్నారు సీఎం జగన్. ఆ స్మార్ట్ టీవీతో విద్యార్థులకు డిజిటల్ బోధన కల్పించాలన్నారు.
ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులూ… ఏపీలో జూన్ రాగానే… ఈ జగనన్న విద్యా కానుక తప్పనిసరిగా అందుకునేలా చేసుకోవాలి. ఇందుకు సంబంధించి విద్యార్థుల స్కూళ్లలో టీచర్లతో ప్రస్తావించాలి. విద్యా కానుక మీ పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చేలా వాళ్లను ముందుగానే ప్రిపేర్ చెయ్యాలి. తద్వారా వాళ్లు కూడా ప్రభుత్వం వాటిని ఎప్పుడు ఇస్తుందా అని అలర్ట్‌గా ఉండి… విద్యార్థులకు వాటిని అందిస్తారు.