Saturday, June 19, 2021

వాట్సప్ యాజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్స్

Must Read

వాట్సాప్​ వాడుతున్న వారికీ గుడ్ న్యూస్​. ఇక పై మొబైల్​ ఫోన్​ అవసరం లేకుండా ఒకేసారి నాలుగు డివైజ్​లకు అకౌంట్ లాగిన్​ అయ్యి వాడుకునేలా ఫీచర్​ త్వరలో రాబోతోంది. ఈ ఫీచర్ గురించి కంపెనీ CEO​ విల్​ క్యాథ్​కార్ట్​​ తెలియజేసారు.

వ్యాబేటాఇన్ఫో ఇంటర్వ్యూలో విల్​ క్యాథ్​కార్ట్​​ మాట్లాడుతూ.. వాట్సాప్​ను ఒకేసారి నాలుగు డివైజ్​లలో లాగిన్​ అయ్యేలా ఫీచర్​ తీసుకురాబోతున్నాం. ఈ ఫీచర్ తో ఐప్యాడ్​లో వాట్సాప్ లాగిన్​ అయ్యేందుకు వీలు ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్​ వెబ్​, డెస్క్​టాప్​ యాప్​ కోసం స్మార్ట్ ఫోన్​తో లాగిన్​(స్కాన్​) చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మీదట మెయిన్​ యాప్​, స్మార్ట్​ ఫోన్ యాప్​​ సపోర్ట్ లేకుండా మల్టీ డివైజ్​ ఫీచర్​(లింక్​)తో లాగిన్​ కావొచ్చు అని ఆయన తెలిపారు.

ఇదే విషయాన్ని మార్క్​ జుకర్​బర్గ్​ కూడా కన్ఫర్మ్​ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. ప్రైవసీ సమస్యలున్నప్పటికీ దీనికి ఒక ఛాలెంజ్​గా తీసుకున్నాం. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించాం. ఫోన్​ స్విచ్ఛాప్ అయినా కూడా మల్టీ డివైజ్ లాగిన్​ ద్వారా వాట్సాప్​ పని చేసేలా ఫీచర్​ పరిశీలనలో ఉంది అని జుకర్​బర్గ్ తెలిపాడు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This