అచ్చం బ్రహ్మంగారు చెప్పినట్టే చేస్తున్న దూడ.. ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

59

బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పుడు మరొకటి జరిగింది. లేగ దూడ అంటే తల్లి చెంతకు చేరి.. బొద్దిగా నిద్రపోవడం లేదా చెంగు చెంగున దూకుతూ అటూ ఇటూ తిరగడం లాంటిది చేస్తుంటది. ఇది సర్వసాధారణం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే లేగ దూడ మాత్రం చాలా విచిత్రమైనది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో మనిషిలా ప్రవర్తించే ఆవులు పుడతాయని చెప్పాడు. ఇప్పుడు ఇదే నిజమైంది.

Image result for మనిషిలా చేస్తున్న దూడ

తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఉన్న ఆంబూరులో ఉండే ఆవు మాత్రం అచ్చం మనిషిలా ప్రవర్తిస్తోంది. వీరాకుప్పంకి చెందిన ఆనందన్ ఇంట్లోని ఆవుకు ఈ మధ్యే మగ దూడ పుట్టింది. నడవడం వచ్చినప్పటి నుంచీ ఈ దూడ చిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇంట్లో వాళ్లు తాగే మంచినీటిని మాత్రమే తాగుతోంది. మనుషులు పడుకునే చోటికి వచ్చి, చాప, దిండు ఉన్న చోట మాత్రమే పడుకుంటోంది. అది కూడా మనిషిలా నిద్రపోతోంది. మామూలుగా ఆవులు చిరుతిళ్ల లాంటివి తినవు. ఈ లేగ దూడ మాత్రం… పిల్లలు చిరుతిళ్లు తినేటప్పుడు నాక్కూడా పెట్టరా అన్నట్లు చూస్తోంది. వాళ్లు జాలి పడి పెడితే… కరకరలాడిస్తూ తింటోంది.

ఈ క్రింద వీడియో చూడండి:

ఇలా దూడ చెయ్యడం చూసి ఇదెక్కడి వింతరా బాబూ అనుకుంటున్నారు వాళ్లు. ఈ చిత్రాలన్నీ చూసి ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులకు మరో షాకిచ్చింది ఈ పిల్ల దూడ. ఏంటంటే… మ్యూజిక్ లవర్సైన ఇంట్లోవాళ్లు సహజంగానే స్పీకర్లు ఏర్పాటు చేసుకున్నారు. వాటిలోంచీ సాంగ్ వచ్చినప్పుడల్లా ఈ దూడ డాన్స్ చేస్తోంది. ఇది చూసి వాళ్లంతా షాకవుతున్నారు. దీనికి ముద్దుగా వేలన్ అనే పేరు పెట్టారు. ఆకలేసినప్పుడు అమ్మ దగ్గరకు వెళ్లి మిగతా టైమంతా ఇంట్లో వాళ్లతో గడిస్తోంది ఈ ఆవు.

Image result for మనిషిలా చేస్తున్న దూడ

ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. క్రమంగా ఊరంతా తెలిసింది. అందరూ ఈ ఇంటికి వచ్చి దూడను రకరకాల యాంగిల్స్‌ లో ఫొటోలు తీసుకుంటున్నారు. కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. ఇలా ఈ దూడ ఎందుకు మనిషిలా ప్రవర్తిస్తోందో ఎవరికీ తెలియట్లేదు. చిన్నప్పుడు మనుషులకైనా, జంతువులకైనా చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసి నేర్చుకునే అలవాటు ఉంటుంది. ఆ క్రమంలో ఈ దూడ కూడా ఇంట్లో వాళ్లను చూసి వాళ్లలాగే చేస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటోందని అంటున్నారు పరిశోధకులు. ఇప్పుడు దానిని చూసేందుకు జనాలు ప్రపంచంలో జరిగే వింతల్లో ఇది ఒకటని అనుకుంటున్నారు. ఈ దూడ మామూలు దూడా కాదని, దైవ రూపం అంటున్నారు. మరి కొందరు గత జన్మలో మనిషి అయ్యి ఉంటుంది, మనిషి లక్షణాలు ఈ దూడలో ఇంకా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి ఆ ఆవు దూడ యజమానులను స్థానికంగా ఫేమస్‌ చేసింది.

Content above bottom navigation