అన్నాబెలె డాల్ స్టోరీ

అన్నాబెలె డాల్ ఈ డాల్ గురించి వింటేనే భయం క‌లుగుతుంది.
ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యంలోకి నెట్టిన దీనిపై సినిమా కూడా వార్నర్ బ్ర‌ద‌ర్స్ తీశారు.
అస‌లు ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయా అనేలా భ‌యాన్ని గుండెల్లో క‌ప్పేస్తుంది ఈ స్టోరీ
అస‌లు ఈ అన్నాబెల్ డాల్ అంటే ఏమిటి దాని రియ‌ల్ స్టోరీ తెలుసుకుందాం

డోర్నా అనే న‌ర్సింగ్ స్టూడెంట్ ద‌గ్గ‌ర ఈ డాల్ ఉండేది. డోర్నా అమ్మ 1970 లో దీనిని గిఫ్ట్ గా కొని ఇచ్చింది.. రెగిడిలో డోర్నా త‌ల్లిఈ డాల్ కొంది.. ఆరోజు నుంచి దీనిని డోర్నా బాగా చూసుకుంది, ఈ స‌మ‌యంలో డోర్నా ఫ్రెండ్ యాంజీకి కూడా ఇది న‌చ్చింది, కాని రోజూ ఆ బొమ్మ త‌నకు తానుగా పొజిష‌న్లు మార్చ‌డం ఇద్ద‌రూ చూశారు, కాలు చేతులు ఆడించేది దానికి అదే న‌వ్వేది.

Image result for annabelle doll

త‌ర్వాత డోర్నా యాంజీ ఈ డాల్ ఇంట్లో ఒంట‌రిగా తిరుగుతుంది అని అనుమానించారు …ఒక రూమ్ లో ఉంచితే వేరే రూమ్ లో ఉండేది.. కొన్ని రోజుల‌కే రాత్రి ప‌డుకుని ఉద‌యం లేచే స‌రికి, ఆ బొమ్మ ఉన్న రూమ్ లో గోడ‌ల‌పై వింత రాత‌లు క‌నిపించాయి.. హెల్ప్ హెల్ప్ అని రాసి ఉంది. దీంతో ఆ డాలే అది రాసింది అని అనుకున్నారు. అంతేకాదు ఆ బొమ్మ చేతికి ర‌క్తం కూడా క‌నిపించింది, దీంతో ఇది నిజ‌మైన బొమ్మ లేదా ఆత్మ అని అనుమానం వ‌చ్చింది.

దీంతో ఆత్మ‌ల‌పై ఇన్వెస్టిగేష‌న్ చేసే వ్య‌క్తిని పిలిచి మాట్లాడారు, హెగెన్స్ అనే ఆ వ్య‌క్తి ఆ బొమ్మ‌తో మాట్లాడాడు, ఈ స‌మ‌యంలో త‌ను ఏడు సంవ‌త్స‌రాల పిల్ల అని చెప్పింది, అమ్మాయి అని ఆత్మ‌గా చెప్పింది. వారిని ఏమీ చేయ‌ను అని చెప్పింది. దీంతో డోర్నా యాంజీ ఆ బొమ్మ‌ని వారితోనే ఉంచుకున్నారు.

ఈ స‌మ‌యంలో డోర్నా యాంజీకి కామ‌న్ ఫ్రెండ్ లూ ఉన్నాడు… ఓరోజు వీరి రూమ్ కి వ‌చ్చాడు, ఈ స‌మ‌యంలో ఆ బొమ్మ‌ని చూసి ఇది నాకు న‌చ్చ‌లేదు బ‌య‌ట‌కు పాడేయండి అని అన్నాడు… ఆ స‌మ‌యంలో ఆ బొమ్మ లూ మాట‌లు వింది ..అత‌నిపై కోపం పెంచుకుంది. ఇక రాత్రి లూ ప‌డుకున్న స‌మ‌యంలో అత‌ని రూమ్ లోకి వెళ్లి అత‌ని చెస్ట్ పై ర‌క్తం వ‌చ్చేలా ఏడు సార్లు గీరింది, దీంతో అత‌ను గ‌ట్టిగా అరుపులు అరిచాడు.. కాని అక్క‌డ బొమ్మ‌లేదు.. డోర్నా యాంజీ వ‌చ్చి చూసేస‌రికి లూకి మాత్రం ర‌క్తం వ‌స్తోంది, త‌న‌ని బొమ్మ గీరింది అని చెప్పాడు.

కాని డోర్నా యాంజీ రూమ్ లో బొమ్మ ఉంది.. ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చూస్తే దాని చేతుల‌కి ర‌క్తం ఉంది, దీంతో భూత‌వైద్యుడ్ని పిలిచారు, అత‌ను ఆ బొమ్మ‌తో మాట్లాడితే తాను ఏడేళ్ల పిల్ల కాదు అని చెప్పింది, కేవ‌లం డోర్నా యాంజీ ద‌గ్గ‌ర ఉండ‌టానికి అబద్దం చెప్పింది, దీంతో ఆ బొమ్మ‌ని మాంత్రికుడు వారెన్స్ ఇంటికి తీసుకువెళ్లాడు, ఆ త‌ర్వాత అత‌ని ఇంటి బ‌య‌ట కేజ్ లో ఉంచాడు, దానిని ఎవ‌రైనా ఏమైనా అన్నా ఎగ‌తాళి చేసినా వారికి ప్ర‌మాధం సంభ‌వించి చ‌నిపోయేవారు. ఇలా ముగ్గురిని చంపేసింది.

త‌ర్వాత దానిలో ఆత్మ ఉంది అని తెలుసుకున్నారు. అప్ప‌టి నుంచి దానిని మ్యూజియంలో దాచారు. కనెక్టివ్ సిటీలో దీనిని ఇప్ప‌టికే భ‌ద్రంగా ఉంచారు.. ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో కేవ‌లం క‌నిపించే విధంగా దీనిని ఉడెన్ బాక్స్ లో పెట్టారు.. అంతేకాదు దీని నెగిటీవ్ ఎఫెక్ట్ ఉండ‌కుండా దీనిని దేవుని ద‌గ్గ‌ర పెట్టి భ‌ద్ర‌ప‌రిచారు.

దీనిపై డోంట్ ట‌చ్ అని వార్నింగ్ గా రాసి ఉంటుంది… అందుకే దీనిని కేవ‌లం చూడ‌టానికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించారు, దీని పై అనేక సినిమాలు వచ్చాయి, అయితే ఆత్మ‌లు న‌మ్మేవారు మాత్రం ఇది నిజ‌మే అని చెబుతారు.

ఈ క్రీడ వీడియో చూడండి:

Content above bottom navigation