అబద్ధం చెబితే పసిగట్టే లై డిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

మీరు సూపర్ సినిమా చూసే ఉంటారు. అందులో బ్రహ్మానందం ఆలీని లైడిటెక్టర్ మిషన్ తో టెస్ట్ చేస్తాడు. ఆలీని క్వశన్స్ అడిగితే అబద్దం చెప్పగానే మిషన్ ఒకలా సౌండ్ ఇస్తుంది. నిజం చెప్తే ఒకలా సౌండ్ ఇస్తుంది. ఆ సీన్ చూడటానికి మనకు కామెడిగానే ఉంటుంది కానీ అలా సౌండ్ ఇచ్చే మిషన్ గురించి మీకు ఎంత తెలుసు. అసలు అది ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ఆ మిషన్ అబద్దాన్ని, నిజాన్ని ఎలా కనిపెడుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

ఒక వ్యక్తి అబద్ధ్దం చెబుతున్నప్పుడు తనకు తెలియకుండానే భావావేశానికి, ఉద్వేగానికి లోనవుతాడు. అపుడు అతని శరీరంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే లైడిటెక్టర్‌ ను రూపొందించారు. ఇది మానవ శరీరంలో రక్తపోటు, గుండె చప్పుడు, శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి కొన్ని మార్పులను నమోదు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్‌ ట్యూబు అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీ చుట్టూ గట్టిగా కడతారు. ఒక పట్టీని రక్తపోటు కొలవడానికి జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపజేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు కూడా ఆ యంత్రంలో ఉంటాయి.

శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫు ద్వారా నమోదు చేస్తారు. ఈ యంత్రం ద్వారా లభించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడం వల్ల నిందితుడు అబద్ధమాడుతున్నాడా లేదా అనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. న్యాయవ్యవస్థ దీన్ని నేర విచారణలో ఒక సాధనంగానే గుర్తిస్తుంది కానీ కేవలం అది అందించే సమాచారం ఆధారంగానే నేర నిర్ధారణ చేయరు. ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్‌ అనే వైద్య విద్యార్థి, ఒక పోలీసు అధికారి సాయంతో కనిపెట్టాడు. లై డిటెక్టర్ టెస్ట్ ఎవరికి చేస్తారు అంటే నిందితులపై చేస్తారని ఇట్టే చెప్పేస్తాం.

Image result for లై డిటెక్టర్‌

అయితే ఇప్పటి నుంచి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కంపెనీకి రెజ్యూమ్ ఇస్తే.. లై డిటెక్టర్ టెస్ట్‌ కు రెడీగా ఉండాల్సిందే. ఎందుకనుకుంటున్నారా.. హైదరాబాద్ నగరంలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని ప్రారంభించేశాయట. అభ్యర్థులు తమకు ఇచ్చే రెజ్యూమ్‌ లలో చెప్పిన విషయాలు నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి ఈ టెస్టులు నిర్వహిస్తున్నాయట. యూరోపియన్ దేశాలలో ఈ టెస్టులు సర్వసాధారణమంటున్నారు నిపుణులు. అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి కంపెనీలు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహిస్తాయని చెబుతున్నారు.

Content above bottom navigation