అమెరికాకు వెళ్లే ముందు ట్రంప్ ఏం చేశాడో చూస్తే శభాష్ అంటారు

175

రెండు రోజుల పర్యటన కోసం ట్రంప్ సకుటుంబ సమేతంగా భారత్ కు విచ్చేసిన సంగతి తెలిసిందే.. ముందు ఫిబ్రవరి 24 వ తేదీన అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం రూపానీ తదితరులు ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమానికి చేరుకుని, గాంధీజీ జీవిత విశేషాలను తెలుసుకున్నారు. రాట్నంతో నూలు వడికి, ఆశ్రమంలో కలియతిరిగిన ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ అక్కడ విశేషాలను వివరించారు. అనంతరం మోతెరా స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ట్రంప్ హజరయ్యారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర రోడ్‌షో సాగింది. అక్కడికి చేరుకోగానే స్టేడియాన్ని ప్రారంభించారు ట్రంప్. ఆ తర్వాత వివిధ అంశాల మీద ప్రసంగించారు ట్రంప్.

ఆ తర్వాత నేరుగా ఆగ్రా వెళ్లి, అక్కడ తాజ్ మహల్ ను సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీలోని మౌర్య హోటల్ లో బస చేశారు. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా బిజీబిజీగా వివిధ కార్యక్రమంలలో పాల్గొన్నారు. ముందు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు దంపతులకు ఘనస్వాగతం పలికారు రాష్ట్రపతి కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోడీ. అక్కడ పలువురు నాయకులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత రాజ్‌ఘాట్ వద్దకు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు ట్రంప్ దంపతులు. అక్కడ ఒక మొక్కను నాటారు ట్రంప్ దంపతులు. ఆ తరువాత హైదరాబాద్ హౌజ్‌లో అమెరికా భారత్‌ల ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వాణిజ్య, రక్షణ అంశాలతో పాటు పలు అంశాలను చర్చించారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీపై ఒప్పందం కుదుర్చుకున్నారు. 3 బిలియన్ డాలర్ల మేరా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు.

Image result for trump at flight

ఆ తర్వాత అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్ లో విందు ఇచ్చారు.. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల సీఎంలను, ప్రముఖులు పాల్గొన్నారు. విందు సమయంలో కూడా ఇరు దేశాల అధినేతల మధ్య కొన్ని ఆసక్తికర విషయాల మీద చర్చ జరిగింది. ఇక విందు తర్వాత అమెరికా వెళ్ళిపోడానికి బయలుదేరారు ట్రంప్ దంపతులు. అయితే వెళ్తూ వెళ్తూ ట్రంప్ చేసిన ఒక పని అందరి చేత శబాష్ అనిపించేలా ఉంది. ఇంతకు ఏం చేశాడు అంటే…. ఫ్లైట్ ఎక్కే ముందు భారత గడ్డకు ముద్దు పెట్టాడు ట్రంప్. తానూ వేసుకున్న షూస్ విప్పి మరి భరతమాత గడ్డకు ముద్దు పెట్టాడు. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా తన రెండు రోజుల పర్యటనను ముగించాడు ట్రంప్.

Content above bottom navigation