అర్జునుడు, ఊర్వశి శృంగార కథ..

మహాభారత పురాణంలో ఐదుగురు పాండవ సోదరులలో అర్జునుడు ఒకడు. దేవతల నాయకుడైన ఇంద్రుడు శక్తితో కుంతి, పాండురాజు లకు జన్మించాడు. చాలా చిన్న వయస్సులో అతను విపరీతమైన ప్రశంసలు అందుకున్నాడు. పాండవులందరిలో అర్జునుడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అర్జునుడితో ఇంద్రలోక అప్సరస అయినా ఊర్వశి శృంగారం చెయ్యాలనుకుంటుంది. కానీ దానిని అర్జునుడు తిరస్కరిస్తాడు. అసలెందుకు తిరస్కరిస్తాడు. దాని వెనుక ఉన్న కథ ఏమిటీ అనే వివరాల్లోకి వెళ్తే..

ఊర్వశి.. ఈమె అందచందాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఇంద్రుని సభలోని అప్సరసలలో ఈమె ఒకరు. నరనారాయణుడు బదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు చూసి దేవేంద్రుడి వెన్నులో భయం పుట్టింది. తన పదవికి ఎక్కడ ఎసురు పెడతారో అనుకున్నాడు. వెంటనే తపస్సును భగ్నం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తమలతో పాటు మరికొందరు అందగత్తెలను పంపాడు. అప్పుడు వాళ్లంతా వెళ్లి నాట్యాలు చేసి తమ అందచందాలను చూపించి తపస్సును భంగం చేయాలనుకుంటారు. అయినా ఫలితం లేకపోయింది. నరనారాయణుడు వారిని చూసి నవ్వారు. ఆ దేవేంద్రుడు మిమ్మల్ని పంపి తపస్సు భంగం చెయ్యమన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఆ దేవేంద్రుడికి ఒక షాక్ ఇస్తాను చూడు అని తన కుడి తొడమీద అరచేత్తో చరచాడు. ఆ శబ్దం నుంచి అందమైన స్త్రీ పుట్టింది. ఆమెనే ఊర్వశి. ఆమె అందం చూసి రంభ, మేనక, అప్సరసలు ఆశ్చర్యపోయారు. ఈ అందెగత్తెను దేవేంద్రునకు కానుకగా పంపుతున్నాను అని, ఆమెను వారికి అప్పగించి తిరిగి తపస్సులోకి వెళ్లిపోతారు. ఇంద్రలోకంలో ఊర్వశి అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఒకసారి అర్జునుడు ఇంద్రలోకం వెళ్తాడు. ఇంద్రలోకానికి వచ్చిన అర్జునుడికి మంచి మర్యాదలు చేస్తాడు దేవేంద్రుడు.

అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని అర్జునుడి గదికి పంపుతాడు. ఊర్వశి అర్జునుడిని ఆనందపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. అర్జునుడి ఎదుట తన అందాలను ఆరబోస్తూ నాట్యం చేస్తుంది. అర్జునుడు ఆమెకు నమస్కరిస్తాడు. నేను నీకు కొడుకులాంటి వాణ్ని. నన్ను మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అంటాడు. అర్జునుడు ఏమి అన్నా కూడా ఊర్వశి పట్టించుకోదు. అర్జునుడిని రెచ్చగొట్టడానికి తన అందాలన్నీ చూపిస్తుంది. దేవలోకంలో ఇవన్నీమామూలే. ఇక్కడ బంధాలు వుండవు. అప్సరసలు వుండేదే అందరినీ ఆనందింపజేయడానికి అని అంటుంది ఊర్వశి. నన్ను అనుభవించు. నాతో తనివితీరా గడుపు అని అర్జునుడితో ఊర్వశి అంటుుంది.అయితే అర్జునుడు మాత్రం ఒప్పుకోడు. ఆమె ఎన్ని చెప్పినా కూడా ఆమె సౌందర్యానికి అర్జునుడు లొంగడు. నాకు ఎందుకో నీపై మోహం కలగడం లేదు. నా మనస్సు నీ సౌందర్యం మోహించలేదు అంటారు. నేను నిన్ను అంగీకరించలేను. నువ్వు నాకు తల్లితో సమానం అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు అర్జునా ! నేను నీతో శృంగారంలో పాల్గొనాలని వచ్చాను. నేను ఈ దేవలోకానికి దేవ వేశ్యని అని నీకు తెలుసుకదా. ఇక్కడ దేవ వేశ్యలకు వావివరసలు ఉండవు. నీతో శృంగారంలో పాల్గొని నీకు మంచి సుఖాన్ని అందిస్తాను అంటుంది ఊర్వశి.

Image result for అర్జునుడు, ఊర్వశి

ఊర్వశీ… మీరు మా వంశకర్త పురూరవుని భార్య కదా.. అలాగే నా తండ్రి అయిన ఇంద్రునికి మీరు పరిచర్యలు చేస్తుంటారు. అందువల్ల నువ్వు నాకు తల్లితో సమానం. నేను నీతో సుఖాన్ని ఎలా పొందగలను. అది మహాపాపం అని అంటాడు అర్జునుడు. ఊర్వశి కోపం వస్తుంది. నేను నిన్ను కోరి వస్తే నన్నే దూరం పెడతావా. నీతో నేను సుఖాన్ని పొందలేనని నేరుగా చెబుతావా అని అర్జునుడిపై ఊర్వశి కోప్పడతుంది. దైవలోకంలో నన్ను ప్రతి ఒక్కరు మోహించారు. ఎవ్వరూ నన్ను ఇంతవరకు తిరస్కరించలేదు. నాకు నేనుగా నిన్ను మోహించాలాని అనుకుంటున్నాను.. నువ్వు మాత్రం నాతో ఇలా మాట్లాడుతున్నావు.. నాకు చాలా కోపం తెప్పించావు..నన్ను ఇంతగా అవమానించావు కాబట్టి నువ్వు కచ్చితంగా అంతకంత అనుభవించాలి అని అంటుంది ఊర్వశి. నేను నిన్ను కోరి వచ్చినా నా కోరిక తీర్చలేదు కాబట్టి నువ్వు భూలోకంలో నపుంసకుడిగా మారుతావు అని అంటుంది. ఊర్వశి శాపం వల్ల పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఉన్నప్పుడు అర్జునుడు బృహన్నల నపుంసకుడిగా మారుతాడు. అజ్నాతవాసం ముగియగానే ఆ శాపం పోతుంది. ఇది ఊర్వశి, అర్జునుల కథ..

Content above bottom navigation