అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపై అమ్మాయి.. ఆమె కోసం బస్సు డ్రైవర్ చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారు..

133

RTC ఉద్యోగుల గురించి సమాజంలో చాలామందికి నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారని, చిల్లర ఇవ్వకుండా సతాయిస్తారని.. ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు. ఇందులో చాలావరకు వాస్తవం ఉన్నా, పనిఒత్తిడి, రకరకాల మనస్తత్వం ఉన్న ప్రయాణికులను ఫేస్ చేయాల్సి రావడం వారి ఇగోలు, ఎమోషన్లను శాటిస్పై చేసే క్రమంలో కొంతమంది ఉద్యోగులు ఇలా ప్రవర్తిస్తుంటారు. కానీ, గంజాయి వనంలో తులసి మొక్కల లాగా వీరిలో కూడా మానవత్వం, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన ఉదాహరణ అని శ్రీధర్ రాజోలి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ ను చుస్తే ఆర్టీసీ డ్రైవర్ చేసిన పనికి ప్రతి ఒక్కరు శబాష్ అంటారు. మరి ఆయన పెట్టిన పోస్ట్ లో ఏముందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

నిన్న రాత్రి హైదరాబాద్ నుండి తాడిపత్రికి 6954 సర్వీస్ లో వచ్చాము. ఇది తాడిపత్రికి చెందిన RTC బస్సు. బస్సులో చాలామంది సాఫ్ట్ వేర్ అమ్మాయిలు, అబ్బాయిలు వున్నారు. మాములుగా అయితే శుక్రవారం రాత్రికి హైదరాబాద్ నుండి బయలుదేరే బస్సుల్లో సగం మంది వీరే వుంటారు. కానీ నిన్న గురువారం అయినా కూడా బస్సులో చాలామంది ఉన్నారు. కారణం కరోనా వైరస్ అని చెప్పారు. ఇక

అసలు విషయానికి వస్తే,…. తెల్లవారు జామున దాదాపు 5 గంటలవుతోంది అనుకుంటాను.. బస్సు రోడ్డుపక్కగా నిలిపివేశారు.. ఎక్కడవున్నామని కిటికీ లోనుంచి బయటికి చూడగా “యాడికి – బుగ్గ ” మధ్యలో పెన్నా సిమెంట్ సెకండ్ ప్లాంట్ కు వెళ్లే దారిలో ఉంది బస్సు. పూర్తి చీకటిగా ఉంది. అక్కడ ఇల్లు కానీ, జనాలు కానీ ఎవరూ లేరు. ఒక అమ్మాయి ,ఇద్దరు డ్రైవర్లు ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు. విషయమేమిటని విచారించగా… ఆమె అక్కడ దిగి పెన్నా సిమెంట్ దగ్గర వున్న తన ఇంటికి వెళ్ళాలి. తనను పికప్ చేసుకోమని నాన్నకు ఫోన్ చేయగా ఇంకా పదినిమిషాలు పడుతుందని చెప్పాడట.. బహుశా ఆమెకు, నాన్నకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బస్సు వెళ్లే సమయానికి ఆయన అక్కడకు చేరుకోలేక పోయారు.

మాములుగా అయితే ఆమెను అక్కడ దింపి వెళ్లిపోవడం ఆ బస్సు డ్రైవర్ విధిధర్మం.. కానీ వీరికి ఆడబిడ్డను ఒంటరిగా ఆ చీకటిలో వదలి వెళ్ళడానికి మనసొప్పలేదు. వారికి షాదనగర్ దిశా గుర్తొచ్చి ఉంటుంది. పదినిమిషాలు లేట్ అయిన పరవాలేదు అని నాన్నకు బిడ్డను అప్పగించి వెళ్లాలని అనుకున్నాను. అందుకే ఆమె తండ్రి వచ్చేంతవరకు బస్సును ఆమె కోసం నిలిపేశారు. బస్సు డ్రైవర్ చేస్తుంది మంచి పనే కాబట్టి బస్సులో ఉన్న ప్యాసింజర్లు కూడా వారికి అడ్డు చెప్పలేదు. విధిధర్మం తో పాటు మానవ ధర్మాన్ని పాటించి ప్రయాణికుల మెప్పు పొందారు ఆ బస్సు డ్రైవర్… సమాజంలో ప్రతిఒక్కరూ ఇలా బాధ్యతగా ఉంటే పోలీసుల అవసరమే ఉండదేమో అని శ్రీధర్ రాజోలి తనకు ఎదురైనా ఘటనను ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. ఆ ఘటన గురించి విన్నాకా ఆ బస్సు డ్రైవర్ చేసిన పనికి సెల్యూట్ చెయ్యాలనిపిస్తుంది కదా..

Content above bottom navigation