ఆక్సిజన్ లేకుండా 3ని..లు బ్రతకలేం కానీ ఇతడు 3 రోజులు బ్రతికాడు

మనకు సాధ్యం కానిది ఇతరులకు సాధ్యం అయినప్పుడు వావ్ ఇట్స్ మిరాకిల్ అని పొగిడేస్తాం. వాళ్లకు గొప్ప శక్తులు ఉన్నాయనే అభిప్రాయానికి వచ్చేస్తాం. అంతేకానీ వాళ్లకు ఆ శక్తి ఎక్కడినుంచి వచ్చిందనే విషయం గురించి పెద్దగా ఆలోచించం, ఎందుకంటే ఎంత ఆలోచించిన సమాదానాలు దొరకవు కాబట్టి. అందుకే ఇప్పటికి కూడా కొన్ని సంఘటనలు అద్భుతాలుగానే మిగిలిపోయాయి. ఆ అద్భుతాల గురించి తెలిస్తే మనం నమ్మడానికి కూడా కొంత సమయం పడుతుంది. అలా నమ్మలేని కొన్ని అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

YouTube Thumbnail Downloader FULL HQ IMAGE
  1. 5500 అడుగుల ఎత్తైన ప్రదేశం నుంచి స్కై డైవింగ్ చేసినప్పుడు ప్యారాచూట్ ఓపెన్ కాకపోతే గాలిలోని ప్రాణాలు గాలిలోనే కలిసిపోతాయి. కానీ అంత ఎత్తు నుంచి పడిపోయినా కూడా ఒక వ్యక్తి బతికే ఉన్నాడంటే అతనిని ఏమనాలి. స్పైడర్ మాన్ అనాలా, సూపర్ మ్యాన్ అనాలా, లేదా ఏదో శక్తి ఉందని అనుకోవాలా?. 5500 ఎత్తు నుంచి డైవ్ చేస్తుండగా రెండు ప్యారాచూట్స్ హ్యాండ్ ఇచ్చాయి. దీంతో వేగంగా భూమిని తాకాడు. అయితే చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి అందరికి షాక్ ఇచ్చాడు. అంత ఎత్తు నుంచి పడినా కూడా ఏమి కాలేదంటే అద్భుతమే అని, అతనికి ఏదో శక్తి ఉందని అందరు అనుకున్నారు.
  2. సాధారణంగా మనుషులు నీటిలో మునిగిపోతే మూడు నిముషాలు కూడా ఉండలేము. కానీ ఈ వ్యక్తి మాత్రం నీటిలో మునిగిపోయిన మూడు రోజులు బతికే ఉన్నాడు. ఒకరోజు సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో నౌక మునిగిపోయింది. అయితే ఆ సమయంలో అతను నౌకలో ఉన్న బాత్ రూమ్ లో ఉన్నాడు. ఎలాగోలా అక్కడి నుంచి అతను కెప్టెన్ రూమ్ లోకి వెళ్ళాడు. అతను తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని నీళ్లలో కలిసిపోయాయి. అయితే ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఉంది. దానిని తాగుతూ మూడు రోజులు ఉన్నాడు. ఫుడ్ లేకుండా బతికాడంటే ఏమో అనుకోవచ్చు కానీ ఆక్సిజన్ లేకుండా ఆ నీటిలో ఉన్నాడంటే ఆశ్చర్యమే మరి.
  3. ఒక్కపూట అన్నం తినడం మానేసిన నీళ్లు తాగడం మానేసినా ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఏమి తినకుండా తాగకుండా ఒక రెండు రోజులు ఉండగలం కానీ రాజస్థాన్ కు చెందిన వారం ప్రహ్లజ్ఞాని అనే సాధువు మాత్రం ఏమి తినకుండా, చుక్క నీళ్లు తాగకుండా 70 ఏళ్ళుగా బతుకుతున్నాడు. 1940 నుంచి అతను తినడం మానేశాడు. నీళ్లు తాగడం మానేశాడు. కేవలం గాలిని మాత్రమే పీల్చుకుని బతుకుతున్న ఈ సాధువును చూసి సైంటిస్టులు సైతం నివ్వెరపోతున్నారు. అతనిని ఒక ల్యాబ్ లో ఉంచి ఎలాంటి ఫుడ్ ఇవ్వకుండా కొన్ని పరీక్షలు చేశారు. అయినా కానీ ఆ రహస్యం ఏమిటో కనుక్కోలేకపోయారు. దీంతో నన్ను దేవుడు పంపాడు నాకు అతీత శక్తులు ఉన్నాయని ఆ సాధువు చెప్పిన మాటనే అందరు నమ్మారు.
  4. మాములుగా గన్ నుంచి వచ్చిన బులెట్ తగిలితే చనిపోతారు. కానీ రష్యాకు చెందిన ఒక సైనికుడు మాత్రం తన నుదుటి మీద బులెట్ తగిలితే ఏదో రాయి తగిలినట్టు ఉన్నాడు. రాయి తగిలిన నొప్పి వస్తుంది. కానీ అతనికి ఎలాంటి నొప్పి లేనట్టు మాములుగా ఉండటం చూసి అందరు షాక్ అవుతున్నారు. నుదుటి లోపల బులెట్ అలాగే ఉంది. ఒక సైనికుడు పట్టుకారుతో ఆ బులెట్ ను తీశాడు. అయినా కానీ తీసేటప్పుడు నొప్పిలేనట్టు ఉన్నాడు.
  5. మనం మంటల్లో ఉంటె కాలిపోతాం. మనుషులమే మంటల్లో కాలిపోతామంటే పేపర్స్ బుక్స్ కనుక ఉంటె అవి కాలిపోకుండా ఉంటాయా చెప్పండి. కానీ ఒక కారు ప్రమాదంలో పెద్ద మంటలు వచ్చినా కానీ ఒక పుస్తకం కాలిపోలేదు. న్యూయార్క్ లో ఒక కారుకు జరిగిన అగ్ని ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి కాలిపోయాడు. కారు మొత్తం కాలి బూడిద అయ్యింది. కానీ ఆ పుస్తకం మాత్రం ఇంచు కూడా కాలలేదు. ఆ పుస్తకం ఏమిటి అంటే బైబిల్ పుస్తకం.. అంత పెద్ద మంటలో కూడా బైబిల్ ఏ మాత్రం కాలిపోకపోవడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా ఆ జీసస్ మహిమే అని అందరు అభిప్రాయపడ్డారు. కొందరేమో మంటలు వ్యాపించని ప్రదేశంలో అది ఉండటం వలన కాలిపోలేదని అన్నారు. ఏది ఏమైనా అంత పెద్ద మంటలో బైబిల్ కాలిపోలేదు అంటే కాస్త ఆశ్చర్యపడే విషయమే.

ఇలా కొన్ని కొన్ని ఘటనలు మనం అస్సలు నమ్మలేని విధంగా ఉన్నాయి. వీటి గురించి వింటుంటే మీకు కూడా నమ్మాలనిపించడం లేదు కదా. కానీ నమ్మితీరాలి. ఎందుకంటే ఇవి నిజంగా జరిగాయి కాబట్టి.

Content above bottom navigation