ఆల్కహాల్‌ తో హెచ్‌ఐవి వస్తుందట..

119

మీరు ఆల్కహాల్ తీసుకుంటారా? అయితే జాగ్రత్త. ఆల్కహాల్ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయనే ఇన్ని రోజులు మనం విన్నాం కానీ, ఆల్కహాల్ తీసుకుంటే ఇప్పుడు HIV కూడా వస్తుందని తేలింది. ప్రస్తుత సమాజంలో ఆల్కహాల్ తీసుకోవడం అంది ఒక ఫాషన్. చాల మంది జీవితాల్లో ఆల్కహాల్ ఒక భాగం అయిపోయింది. పెళ్లిళ్లు, పార్టీల్లో మందు ఉంటేనే ఎంజాయ్‌మెంట్. దీనికి చాలామంది అడిక్ట్ అయ్యారు. అబ్బాయిలే అంటే అమ్మాయిలు కూడా ఈ మధ్య డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాగేటప్పుడు ఎంజాయ్ చేసినా, ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోలుకోలేని దెబ్బతీసే మత్తు పానీయం ఇది. ఈ వ్యసనానికి అలవాటు పడిన వాళ్లు మానేయడానికి చాలా ఇబ్బందిపడతారు. డ్రింక్ చెయ్యడం వల్ల శరీరంలోని ప్రతి అవయవానికి హాని కలుగుతుంది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశముంది.

Image result for alcohol drinking

ఆల్కహాల్ అనేది ఒక విషపూరితమైన పదార్థం. ఆల్కహాల్ వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 3 మిలియన్ల మంది మరణిస్తున్నారు. అలాగే లక్షలాది మంది ప్రజలు వైకల్యానికి, అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా మద్యం 5.1 శాతం అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. మద్యపానం వలన ప్రపంచవ్యాప్తంగా 7.1 పురుషులు, 2.2 శాతం మహిళలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో అకాల మరణాలకు, వైకల్యానికి మద్యపానం ప్రధాన కారకం. ఈ వయస్సులో మరణించిన వారిలో 10 శాతం మంది మద్యపానం వల్ల చనిపోయారు. అలాగే మద్యం సేవించడం వల్ల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది.

Image result for alcohol drinking

మద్యపానం అనారోగ్యానికి కారణం అని ఎన్ని సార్లు విన్న మార్పు రాదు. ఎందుకంటే మద్యానికి అంతలా బానిసలు అయిపోయారు. మద్యం అనేది విషంతో సమానం. ఇది శరీరంలోని ప్రతి అవయవం మీద దుష్ప్రభావం చూపుతుంది. మద్యం తాగడం వల్ల నరాల బలహీనత, అల్సర్‌, గుండెజబ్బులు, కిడ్నీ, లివర్‌ అనారోగ్యాలకి గురవుతారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం… మద్యపానం కాన్సర్ వ్యాధికి కారకమని వివరించారు. మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుందని, దీని వల్ల టీబీ, హెచ్ఐవితో సహ పలు వ్యాధులు సోకె ప్రమాదాన్ని పెంచుతుందని వివరించారు. చట్టవిరుద్ధంగా ఉత్పత్తి చేయబడిన మద్యంలో విషపూరిత కలుషితాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మరింత అనారోగ్యానికి గురిచేస్తుంది. మద్యం తాగడం వల్ల శారీరక అలసట, మానసిక ప్రశాంతత దొరుకుతుందని ప్రారంభించి, చివరకు మరణపు అంచుల వరకు వెళ్లారు .మద్యం ఎంత పరిమాణంలో సేవించినా, అది ఆరోగ్యానికి మంచిది కాదు, కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ లభించవచ్చేమో కానీ, మద్యపానం వల్ల కేన్సర్, ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆల్కహాల్ అలవాటు ఉంటె వీలైనంత తొందరగా మానెయ్యండి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation