ఆ కులంలో పుడితే.. ఊరందరికీ వేశ్యేనా.. ఎవడి పక్కలోకైనా రావాల్సిందేనా..?

177

అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్నా..ఇంకా మన సమాజంలోని కొన్ని వర్గాలు మాత్రం చీకటిలోనే ఉన్నాయి. కాదు కాదు.. వాటిని మన సమాజం ఇంకా చీకటిలోనే ఉంచుతోంది. అలాంటి చీకటి ఆచారాల్లో జోగిని ఒకటి. నాగరిక సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్న దురాచారం జోగిని. ఇప్పుడు దీన్ని నేరంగా పరిగణిస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ వంటి చోట్ల ఇంకా ఈ అనాచారం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ సాంఘిక నేరానికి అసలైన కారణం పేదరికం, సాంఘిక చిన్నచూపే.

అసలేంటీ ఆచారం అనేది ఒక్కసారి పరిశీలిస్తే.. జోగిని వ్యవస్థ అంటే అమ్మాయి చిన్నప్పుడు, ఆమెకు అర్థం చేసుకునే వయసులో చేసే సంప్రదాయం. అంతకముందు ఉన్న జోగిని చనిపోతే ఆ కుటుంబంలో మళ్లీ ఒకరిని జోగినిని చేస్తారు.. వాళ్లింట్లో అందరూ ఆడపిల్లలే ఉండి మగపిల్లలు లేకపోతే ఆడపిల్లని దేవునికిచ్చి పెళ్లి చేస్తారు. కొన్ని ఇళ్లల్లో సాంప్రదాయంగా జోగిని వ్యవస్థ ఉందని చేస్తారు. వేరే జోగిని ఉండి, ఆమె చనిపోతే ఆమె స్థానంలో ఇంకొకామెను జోగిని చెయ్యకపోతే నష్టం వస్తుందని చేస్తారు. కొందరు అయితే ఆ ఊరికి ఏమన్నా జరుగుతుందని చేస్తారు.. ఆడపిల్లకి చిన్నప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే దేవుని దగ్గరకు తీసుకెళ్ళి, మొక్కుకుని వస్తే ఆ పిల్ల పెద్దైన తర్వాత ఆ ఎల్లమ్మకు ఇస్తానని కూడా మొక్కుకుంటారు. అలా రకరకాల ఉద్దేశ్యాలతో ఆడపిల్లను జోగినిగా చేస్తారు.

Image result for jogini system

జోగిని పేరుతో వయసొచ్చిన ఆమెను లైసెన్స్‌డ్‌ వేశ్యగా మార్చేస్తారు. జోగినిలు పాత మట్టి ఇళ్లలో దుర్భర జీవితాలు గడుపుతారు. వాళ్లకి, చిన్నప్పుడు జోగిని చేసేటప్పుడే, శుక్రవారం, మంగళవారం బిచ్చమెత్తుకోవాలని, ఇల్లిల్లు తిరిగి అడుక్కోవాలని, అడుక్కోని తింటేనే మంచిగ ఉంటదని, లేకపోతే చెడు జరుగుతదని చెప్తారు. జోగిని అయిన తర్వాత గ్రామదేవతల పూజ చేయడానికి పోతారు. ఊళ్లో పెళ్లిళ్లు జరిగితే సాక అని ఉంటుంది. దానికి వాడుకుంటారు. బుట్ట, కుండ తీసుకుని పెళ్లి దగ్గరకి, చావు దగ్గరికి వెళ్తారు. పల్లెల్లో ఈ జోగిని దురాచారం బారిన పడి చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతన్నాయి. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినా ఈ దురాచారం మాత్రం ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఈ దురాచారం తగ్గుముఖం పట్టినా పూర్తిగా సమసిపోలేదు. అయితే పల్లెటూళ్లలోని సాంఘిక అసమానతలు ఈ ఆచారాన్ని ఇంకా బతికిస్తున్నాయి. పొరబపాటున జోగిని మారిన వాళ్లు మాత్రం.. ఇక వివాహాలు కాక.. వేరే బతుకు తెరువులేక వేశ్యావృత్తిలో చిక్కుకుపోతున్నారు. కొన్ని ఎన్జీవోలు ఈ సమస్యపై పోరాడుతున్నా.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఈ వ్యవస్థ పూర్తీగా రుపుమసిపోవాలని కోరుకుందాం.

Content above bottom navigation