ఆ బీచ్ లో ఆత్మలుంటాయి.. నడుస్తుంటే మిమ్మల్ని తాకుతుంటాయి

153

కళ్లకు అందనంత దూరం వరకు సముద్రం.. కనుచూపు మేర తీరం.. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే అలలు. ఇసుక తిన్నెలు పరిచిన పరుపులపై సేదతీరుతున్న జనాలు… బీచుల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించడం సహజం. కానీ ఆ బీచ్ కెళ్తే మాత్రం తెలియని ఆందోళన వెంటాడుతుంది. భయపెట్టే హోరుగాలి మనల్ని మాయం చేసేస్తుంది. ఎందుకంటే ఇదొక దెయ్యాల బీచ్. అందుకే ఆ బీచ్ ఒక మిస్టరీ బీచ్ గా ఫేమస్ అయ్యింది. ఇంతకు ఆ భయంకర బీచ్ ఎక్కడుంది? అక్కడ ఉన్న దెయ్యాల సంగతి ఏంటి. ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for dumas beach

గుజరాత్ లోని సూరత్ కి 21కి.మీ ల దూరంలో ఈ దెయ్యాల బీచ్ ఉంది. ఆ బీచ్ పేరు “డ్యూమాస్ బీచ్”. నిజానికి ఎంతో అందమైన బీచ్. కానీ అక్కడికి వెళ్లేవారికి మాత్రం చాలా భయంకరమైన అనుభవాలు ఎదురౌతాయట. పగలంతా జనంతో కళకళలాడే ఈ బీచ్ సాయంత్రం అయ్యేసరికి నిర్మానుష్యం అయిపోతుంది. ఆ బీచ్ లో నడుస్తూ వుంటే మన వెనక మనకే కనపడకుండా ఎవరో ఫాలో అవుతున్నట్లు ఉంటుందంట. మన చెవి దగ్గర ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుందట. ఎవరో బాధగా అరుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు, మూలుగుతున్నట్టు వినపడుతుందట. రాత్రిళ్ళు అక్కడికెళ్తే ఇక తిరిగి రారు అని కూడా చెప్తుంటారు అక్కడి స్థానికులు. నిజానికి ఇక్కడ నాలుగు బీచ్ లను కలిపి డ్యూమాస్ బీచ్ గా చెప్తారు. అందులో రెండు బీచ్ లు మాత్రం జనంతో కళకళలాడిపోతాయి. ఇక మూడో బీచ్ లో కూడా కాస్తో కూస్తో జనం ఉంటారు. ఇంక నాలుగో బీచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దెయ్యాల బీచ్. విచిత్రమేంటంటే, ఈ బీచ్ లో ఇసుక కూడా నల్లగా ఉంటుంది.

Image result for dumas beach

డ్యూమాస్‌ బీచ్‌లో ఇసుక నల్లగా ఉండటానికి స్థానికులు ఒక కథ చెబుతారు. పురాణాల కాలంలో డ్యూమాస్‌ బీచ్‌ శ్మశానవాటికగా ఉండేదట. లక్షలాది మృతదేహాలకు ఇక్కడ దహనం చేశారట. ఆ దహనం తాలూకు బూడిద ఈ ప్రదేశంలో అణువణువూ కలిసిపోయిందనీ.. అందుకే ఇక్కడి ఇసుక నలుపు రంగులో ఉంటుందని చెబుతారు. ఇక్కడి ఇసుకలో బూడిద కూడా కనిపించడం ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది. అయితే కొందరు అక్కడి స్థానికుల మాటలను తప్పు పడుతున్నారు. ఇసుక నల్లరంగులో ఉంటే మాత్రం ఏమొచ్చింది. నేల స్వభావాన్ని బట్టి రంగు ఉంటుంది కానీ, ఎప్పుడో మృతదేహాలు దహనం చేశారని నేల నల్లబడుతుందా అంటూ తీరానికి వెళ్లినవారూ ఉన్నారు. కానీ, ఎంతమంది వెళ్లారో.. అంతమంది తిరిగొచ్చిన దాఖలాలు చాలా తక్కువ. బీచ్‌లో తప్పిపోయారో.. ప్రాణాలు కోల్పోయారో తెలియదు కానీ, మిస్సింగ్‌ కేసులు పెరిగిపోయాయి. పోలీసులు కూడా డ్యూమాస్‌ బీచ్‌ మిస్సింగ్‌ కేసులను తేలిగ్గా తీసుకుంటారు.

డ్యూమాస్‌ మిస్టరీని చేధించడానికి ఇప్పటి దాకా ఎంతో మంది ఔత్సాహిక పర్యాటకులు, పరిశోధకులు చాలామందే ప్రయత్నించారు. అక్కడ ఏవో ఉన్నాయని తెలుసుకోగలిగారు. కానీ అవేమిటో కనిపెట్టలేపోయారు. స్పెషల్‌ కెమెరాలతో ఫొటోలు తీశారు, స్పీడ్‌ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ కెమెరాలకు విచిత్రాలు చిక్కాయి. ఒకరి కెమెరాకు మానవాకారంలో ఉన్న ధూళి కణాలు చిక్కాయి. మరో కెమెరాలో వింత ఆకారాలు పడ్డాయి. కొన్ని కెమెరాలు ఎందుకూ పనికి రాకుండా పాడైపోయాయి. దీంతో ఈ డ్యూమాస్‌ బీచ్‌ నెంబర్‌ నాలుగులో ఆత్మలున్నాయన్న నిర్ణయానికి వచ్చారు చాలామంది. ఇప్పటికీ డ్యూమాస్‌ బీచ్‌ లో రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మల సంచారంలో నిజానిజాలు నిగ్గు తేలేదెన్నడో కానీ ఇప్పటికైతే డ్యూమాస్‌ బీచ్‌ అంతుచిక్కని రహస్యమే.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation