కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇది కొంత మందికి రాదు అని వార్తలు వచ్చాయి..
పైగా అతి చలి ఉన్న చోట వైరస్ వస్తుంది అని కొందరు అన్నారు.
మరీ వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ బతకదు
30 డిగ్రీలు ఉంటే వైరస్ చనిపోతుంది అని కామెంట్స్ చేశారు
కాని అవన్నీ ట్రాష్ వార్తలు ఎందుకు అంటే అతి చలి అతి వేడి ప్రాంతాల్లో కూడా వైరస్ తన ఉనికి చాటుతోంది.
హ్యపీగా బతుకుతూ అందరి ఆనంద జీవితాన్ని నానశం చేస్తోంది.
చైనాలో వెలుగులోకి వచ్చిన ప్రాణాంతకమైన మహమ్మరి
ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది.
ఇంకా ఎంతో మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది.
అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా ఈ మహమ్మారి వైరస్ విస్తరించింది
తాజాగా దీని గురించి మరో సంచలన వార్త వినిపిస్తోంది అదేమిటి అంటే.
ఈ మహమ్మారి వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలందరినీ ప్రాణభయంతో వణికిస్తుంటే… మరోవైపు ఈ వైరస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ వైరస్ కు సరైన విరుగుడు మందు లేదని నివారణ ఒక్కటే మార్గం అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. అయితే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి ఈ వైరస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనేది ప్రజల్లో నెలకొన్న ప్రశ్న.

ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని తాజాగా చైనాకు చెందిన వైద్యులు ఓ పరిశోధన ద్వారా వెల్లడించారు. చైనాలోని జిన్యింతాన్ ఆస్పత్రి వైద్యులు దీనికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. వీరి పరిశోధనలో ఏ బ్లడ్ గ్రూపు ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా వస్తుందని నిర్ధారణ అయిందట….. అంతేకాదు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వారికి కూడా నెమ్మదిగా ఈ వైరస్ ప్రభావం చూపుతుందట. ఇక మిగిలిన బ్లడ్ గ్రూప్ ల వారిపై కరోనా వైరస్ తక్కువ ప్రభావం చూపుతుంది అని చెబుతున్నారు వైద్యులు. అయితే ఈ వైరస్ ముందుగా వెలుగులోకి వచ్చిన చైనాలోనూ వుహాన్ నగరంలో కరోనా వైరస్ సోకిన 2173 మంది పై ఈ పరిశోధన చేసినట్లు వెల్లడించారు.
కాని కొన్ని వైద్య పరిశోధన కేంద్రాలు దీనిని కొట్టిపారేస్తున్నాయి, ఈ వైరస్ ఇమ్యూనిటి సిస్టమ్ దెబ్బతీస్తుంది అని ఏ బ్లడ్ గ్రూపు వారికి అయినా ఇది చేటు అని అంటున్నారు.
భారత్‌లో రెండో దశకు కరోనా.. ఇప్పుడే నియంత్రించకపోతే కష్టమే డేంజర్ సైరన్
పేదలకు ఒకేసారి ఆరునెలల రేషన్… కరోనా ఎఫెక్ట్‌తో కీలక నిర్ణయం ఏం ఏం ఇస్తారంటే