ఇండియాలో ఉన్న ‘ ఘోస్ట్ టౌన్స్ ‘

110

దెయ్యాలు నిజంగా ఉన్నాయా.. అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి చాలా మంది పరిశోదనలు చేస్తూనే వస్తున్నారు.. అసలు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి.. నిజంగానే సినిమాల్లో చూపించినట్లు దెయ్యాలు రక్తాన్ని తాగుతాయా..మనుషులను హింసిస్తాయా.. అనే విషయాలు ఇప్పటికి కూడా రుజువవ్వడం లేదు. కానీ కొన్ని ప్రదేశాలలో దెయ్యాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని ప్రదేశాలల గురించి ప్రస్తావిస్తే..

voice…

 • హంపి, కర్ణాటక
  ఒకప్పుడు బంగారు నగరంగా ఉన్న హంపి ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని బెంగళూరుకు సమీపంలో ఉన్న ఒక నిర్జన పట్టణం. ఇది ముస్లిం ఆక్రమణదారుల దాడులకు అనేకసార్లు గురైంది. వారు ఈ నగరం యొక్క బంగారాన్ని, సంపదను పూర్తిగా దోచుకునే వరకు కూడా వదలలేదు. ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్న ఈ పట్టణం కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడ అనేక దేవాలయాలు, రధాల శిధిలాలు కనిపిస్తాయి. అంతేకాదు ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయనే ప్రచారం ఉంది. అందుకే రాత్రి అయితే ఎవరు కూడా ఇక్కడ కనిపించరు. .
 • ​కుల్ ధారా, రాజస్థాన్
  రాజస్థాన్ లోని జైసల్మేర్ గోల్డెన్ సిటీ లో ఉన్న కుల్దారాను ఇండియాలో ఉన్న భయానక ప్రదేశంగా చెబుతారు. ఒకప్పుడు సంతోషకరమైన చిన్న గ్రామంగా ఉండే ఈ ప్రాంతం అక్కడి గ్రామస్తుల చేతే శపించబడిందని నమ్ముతారు. ఈ ప్రాంతాన్ని పాలించే ఓ రాజు ఇక్కడి గ్రామస్తుల్లో ఒకరి కుమార్తె అందానికి ముగ్ధుడై ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ అమ్మాయిని తన వద్దకు పంపించడానికి గ్రామస్తులకు ఒక్క రాత్రి సమయం ఇస్తాడు. ఆ అమ్మాయిని కాపాడేందుకు గ్రామస్తులందరూ ఈ ప్రదేశాన్ని రాత్రికి రాత్రే ఖాళీ చేస్తారు. అప్పటి నుండి ఈ గ్రామంలో ఒక్క మనిషి కూడా జీవించడం లేదు. కాలక్రమంలో ఇది ఒక దెయ్యాల దిబ్బగా మారిపోయింది. చీకటి పడిన తరువాత ఈ గ్రామంలో వింత శబ్ధాలు, అరుపులు వినిపించడంతో పాటు ఆత్మలు తిరుగుతుంటాయని నమ్ముతారు.
 • ​లఖ్పత్, గుజరాత్
  గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న లఖ్పత్ ఒక పురాతన కోట పట్టణం. దీనిని ఘోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒకప్పుడు అద్భుతమైన నగరంగా ఉండేది. కానీ నేడు ఈ ప్రాంతం శిధిలాల నగరంగా మారింది. ఇక్కడికి మీరు వెళ్తే పాత భవనాలు, బీటలు వారిన కోటలు మాత్రమే కనిపిస్తాయి. కొంతమంది ఇప్పటికీ ఈ కోట గోడల లోపల నివసిస్తున్నారు. ఇందులో చిన్న గురుద్వారా కూడా ఉంది.
Image result for ఇండియాలో దెయ్యాలు
 • ​మండు, మధ్యప్రదేశ్
  మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా మాల్వా ప్రాంతంలో ఉన్న శిధిలమైన దెయ్యాల నగరం మండు. ఇక్కడ అనేక జైన దేవాలయాలు, మసీదులు, పాత భవనాలు కనిపిస్తాయి. భారతదేశంలో ఎక్కువగా సందర్శించే దెయ్యాల పట్టణాల్లో ఇది ఒకటి. ఇక్కడ రాణి రూపమతి, సుల్తాన్ బాజ్ బహదూర్ లు దెయ్యాలై తిరుగుతున్నారని అంటారు.
 • ధనుష్కోడి, తమిళనాడు
  తమిళనాడులోని పంబన్ ద్వీపంలో ఉన్న ఈ అందమైన తీర పట్టణం ఒకప్పుడు ప్రజలతో ఎంతో సంతోషకరమైన ప్రాంతంగా ఉండేది. ఈ మనోహరమైన పట్టణంలో మొత్తం ఆనందం 1964లో వచ్చిన ఘోరమైన తుఫానుతో తుడిచిపెట్టుకుపోయింది. ఈ తుఫాను ధనుష్కోడి పట్టణాన్ని మొత్తం నాశనం చేసి కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ తుఫాను పంబాన్ – ధనుష్కోడి అనే ప్యాసింజర్ రైలును కూడా తాకింది. దీంతో అందులో ఉన్న 115 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. ఇక్కడ దెయ్యాలు ఉన్నారనే ప్రచారం ఉంది. రాత్రయితే ఎవరూ ఈ పరిసరాల్లో ఉండే సాహసం చేయరు.
 • ​ఫతేపూర్ సిక్రీ, ఉత్తర్ ప్రదేశ్
  ఫతేపూర్ సిక్రీను మొఘల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించారు. ఇది మొఘల్ రాజధానిగా 1571 నుండి 1585 వరకూ సేవలు అందించింది. మొత్తం కోటలు, రాజభవనాలతో ఎంతో అందంగా ఉండే ఈ నగరాన్ని రాజు ఎంతో ఇష్టపడేవాడు. అయితే తరువాతి కాలంలో ఈ ప్రాంతంలో ప్రజలు బతికేందుకు తగిన నీరు లేనందున అది దెయ్యాల పట్టణంగా మారింది.

ఇలా ఇండియాలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికి కూడా దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. కానీ ఈ ప్రాంతాలలో ఇప్పటివరకు ఎవరు కూడా దెయ్యాలని చూసింది లేదు. కానీ అక్కడ పుకార్ల వలన అక్కడ దెయ్యాలు ఉన్నాయని ఇప్పటికి నమ్ముతారు.

Content above bottom navigation