మనం కాళ్లకు వేసుకోడానికి షూస్ వేసుకుంటాం. మార్కెట్ లో వివిధ బ్రాండ్స్ ఉన్నా కూడా చూడటానికి ఆ షూస్ అన్ని ఒకే రకంగా ఉంటాయి. కానీ చూడగానే ఆశ్చర్యం వేసి, వేసుకోడానికి భయం వేసే షూస్ ను మీరు ఎప్పుడైనా చూశారా.. షూస్ వేసుకోడానికి ఎందుకు భయం ఉంటుంది అంటారా.. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విచిత్ర షూస్ ను వేసుకోవాలంటే ఒకింత ఆలోచించాల్సి ఉంటుంది. అంత డిఫరెంట్ గా ఉన్నాయి ఆ షూస్.. మరి ఆ డిఫరెంట్ షూస్ గురించి తెలుసుకుందామా..
- బర్గర్ షూ..
2008 లో నైక్ కంపెనీ 7 మందిని ఒక కొత్త రకమైన షూ ను తయారుచెయ్యమని చెప్పింది. ఆ ఏడుగురు ఒక కొత్త రకమైన షూను తయారుచేశారు. అందులో ఒక స్వీడిష్ డిజైనర్ అయినా అలీ హెమ్మర్ ఒక బర్గర్ మ్యాక్ షేప్ లో ఉన్న ఒక షూ ను తయారుచేశారు. అది నిజంగానే ఒక యూనిక్ డిజైన్ గా ఉంది. - ఫుట్ క్యాప్షన్ స్నికర్..
ఈ డిజైన్ ను 22 ఏళ్ల ఒక జార్జియన్ కుర్రాడు తయారుచేశాడు. అతను కొన్ని న్యాచురల్ డిజైన్స్ మీద వర్క్ చేసేవాడు.. అప్పుడే ఈ డిజైన్ ఐడియా వచ్చిందంట. వచ్చిన వెంటనే ఈ రకమైన డిజైన్ ను చేశా అని అతను చెప్పాడు. - టోక్యో LED షూస్…
ఈ టోక్యో LED షూస్ ను జపాన్ వాళ్ళు తయారుచేశారు. జపాన్ పేరు వినగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. ఈ LED షూలో అనేక రకాల మోడల్స్ తయారుచేశారు. ఈ షూ ఎక్కువగా నైట్ పార్టీల కోసం తయారుచేశారు. ఆ షూలో ఉండే LED లైట్స్ నైట్ టైమ్ వెలుగుతుంటాయి. అలాగే మొబైల్ యాప్ సహాయంతో వాటి కలర్స్ ను కూడా చేంజ్ చెయ్యవచ్చు. - టోటల్ నాకౌట్..
ఈ షూస్ చూడటానికి బాక్సింగ్ క్లౌజ్ లాగా ఉంటాయి. బాక్సింగ్ ను ఎక్కువగా ఇష్టపడేవారు కోసం ఈ రకం షూస్ ను తయారుచేశారు.

- గూస్ బూట్స్..
జాక్ అండ్ కైలా అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని కొత్త కొత్త రకాల షూస్ ను తయారుచేస్తారు. వాటిని ఆన్ లైన్ లో అమ్ముతుంటారు. వీరి డిజైన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. బాతు లాంటి షూ కూడా తయారుచేశారు అంటే వీరి తెలివి ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. - చియర్ పియర్ పంప్స్..
కొంతమందికి విచిత్రంగా ఉండే షూస్ అంటే చాలా ఇష్టం. అలాంటి వారిలో ఒకరే కైలార్ స్టోర్. ఈమె చియర్ పియర్ అనే షూస్ ను తయారుచేసింది. ఈ షూ చూడటానికి ఒక డాల్ లాగా ఉంటుంది. ఈ షూ కు ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే.. ఈ షూ హాట్ ను కస్టమర్స్ తమకు నచ్సిన హైట్ లో సెట్ చేసుకోవచ్చు. - గోల్డ్ ఫిష్ డిస్కో హిల్స్..
దీని ట్రాన్ఫరెంట్ ఫిష్ ట్యాంక్ చూడటానికి ఎంతో బాగుంటుంది. మీరు ఈ షూ వేసుకునే ఎక్కడికైనా వెళ్లాలంటే ఫిష్ అక్వేరియం ను కూడా ఇందులో పెట్టుకుని వెళ్ళవచ్చు. ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయి. వీటిని మీరు ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు. - జురాసిక్ పంప్స్…
డైనోసార్స్ బాగా నచ్చే వాళ్లకు ఈ షూ బాగా నచ్చుతాయి. ఈ డిజైన్ ను కూడా కైలా అండ్ జాక్ తయారుచేశారు. ఈ షూ చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. చూడటానికి డైనోసార్ ను మనం కాళ్ళ కింద వేసుకుని నడుస్తున్నామా అనే విధంగా ఉంటుంది. - ద వైర్ షూస్..
ఈ షూ పూర్తీగా వైర్లతో చేశారు. మనం కాళ్లకు వేసుకున్నా కూడా వేసుకోనట్టే ఉంటుంది. నడుస్తున్నా కూడా భూమి మీద మన కాళ్ళు పెట్టినట్టే ఉంటుంది. - డెబిస్ ఫస్ట్ పర్సొనా..
ఈ రకం షూ ను మీరు కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు మీరు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ షూ యూనిక్ గా ఉండటమే కాకుండా ఎక్స్పెన్సివ్ గా కూడా ఉంటుంది. ఈ షూ ను ఎలుగుబంటి ఆకారంలో తయారుచేశారు. దీని లుక్ తోడేలు ఆకారంలో ఉంటుంది.
ఇవేనండి కొన్ని వింతైన షూస్. చూడటానికే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి..ఇక వేసుకుంటే ఎలా ఉంటాయో కదా..మరి ఈ షూస్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.