ఇప్పటికీ రహస్యంగానే ఉన్న పాతాళేశ్వర దేవాలయం…

153

మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాక భారత దేశ చరిత్రలోనే పూనే ప్రత్యేకత సంతరించుకొన్న నగరం. మరాఠాల థీరత్వానికి ప్రతీక. ముఖ్యంగా శివాజీ పాలనలో ఈ పూనే సర్వతోముఖంగా అభివద్ధి చెందింది. అనేక కోటలు, ఉధ్యానవనాలు నిర్మించబడ్డాయి. అంతకు ముందు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కూడా పూణేలో అనేక దేవాలయాలను నిర్మించారు. ఇక స్వాతంత్ర సంగ్రామంలో ఈ పూనే లో కొంత కాలం మహాత్మాగాంధీతో పాటు అనేక మంది నాయకులను బంధించారు. ఇలా చారిత్రాత్మకంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా పూణే ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో పూణేలో చూడవల్సిన ప్రసిద్ది ప్రదేశాల్లో ఒకటి పాతాళేశ్వర ఆలయం. ఈ పాతాళేశ్వర గుహాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పాతాళేశ్వర్ ఒక గుహాలయం. ఇది ప్రముఖ శివాలయం. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. రాష్ట్రకూటల కాలంలో కొండను తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ పాతాళేశ్వర గుహ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించబడినది. ఈ దేవాలయంలో శివుడు ప్రధాన దేవుడు. ఇప్పటికీ ఈ దేవాలయంలోని శివలింగానికి పూజలు జరుగుతున్నాయి. శివలింగం ముందు ఉన్న మంటపంలో ఉన్న నంది విగ్రహం విలక్షణంగా ఉంటుంది. నందితో పాటు ఇతర దేవాతామూర్తులు విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలోని శివుడిని పాతాళేశ్వర్ అని పిలుస్తారు. ఎందుకుంటే ఈ ఆలయంలో శివుడు భూగర్భంలో ఉండటం వల్ల అలా పిలవబడుతున్నాడు. ఇక్కడ కనిపించే ప్రతి శిల్ప ఏదో చెప్పటానికి నిశ్శబ్దంగా ఉన్నట్లు కనబడుతాయి. ఈ పాతాళేశ్వర దేవాలయం 8వ శతాబ్దానికి చెందినది. దాదాపు 1400 ఏళ్ళ క్రితం నాటి ఈ పాతాళేశ్వర్ గుహాలయం పూణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్ లో ఉంది. పాతాల లోకపు దేవుడు కాబట్టి ఈ గుడికి పాతాళేశ్వర దేవాలయం అనే పేరు వచ్చింది. నిర్మాణ శైలిలో ఈ గుడి ఎలిఫెంటా గుహలను, ఎల్లోరా గుహలను పోలి ఉంటుంది.

Image result for పాతాళేశ్వర దేవాలయం pune

ఈ గుహాలయంలో లిఖించిన కొన్ని శాసనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కొన్ని నిర్మాణాలు బౌద్ధ శైలి నిర్మాణాలను పోలి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ కళాఖండాలు పురావస్తు శాస్త్రజ్ఞులకు కూడా పూర్తిగా అర్థం కావడం లేదు అనేది వాస్తవం. ఈ దేవాలయంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. దీన్ని ఒకే ఒక పెద్దరాయి నుండి తొలిచారు. ఈ ఆలయంలో శివలింగాన్ని కూడా చూడవచ్చు. రాతి గుహలోని గర్భగుడిలో శివలింగం, ఇరువైపులా ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. శివుడి విగ్రహానికి ఎడమ చేతి వైపు రామ, సీత, లక్ష్మణుల విగ్రహాలు అద్భుతంగా ఆకర్షిస్తాయి. నల్లబల్లపై నిలబడి భంగిమలో ఉన్న ఈ విగ్రహాలపై అద్భుతంగా సూర్య కిరణాలను ప్రకాశిస్తాయి. ఈ ఆలయాన్ని బౌద్ధమత శైలి హిందూ శైలిలో నిర్మించారు. అంతేకాక ఈ ఆలయంలో విగ్రహాలు నిలబడి ఉండటం ఒక రహస్యంగా ఉంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఈ ఆలయం కూడా ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న శివాజి నగరంలో ఉండే ఈ దేవాలయం సాంప్రదాయక వారసత్వం కలిగి ఉంది. ఈ గుడి ఎప్పుడు తెరిచే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

Content above bottom navigation