ఇప్పటి వరకూ ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షుల భార్యలు ఏం చేశారో తెలుసా..?

ఇప్పుడు ఇండియా మొత్తం అమెరికా అధ్యక్షుడి ఇండియా రాక గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చాడు ట్రంప్. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమం వెళ్లారు. ఆ తరువాత అహ్మదాబాద్ లో ఉన్న మొతేరా క్రికెట్ స్టేడియంకు వెళ్లారు. అక్కడ నమస్తే ట్రంప్ పోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆగ్రా చేరుకొని తాజ్ మహల్ అందాలను సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీ చేరుకొని అక్కడ మౌర్య హోటల్ లో బస చేశారు. ఈరోజు మరికొన్ని కార్యక్రమాలలో పాల్గొననున్నారు ట్రంప్ దంపతులు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పటివరకూ ట్రంప్ తో కలసి 7 గురు అమెరికా అధ్యక్షులు ఇండియా వచ్చారు. వారితో పాటు వారి భార్యలూ ఇండియా వచ్చారు. భార్యలను విదేశీ యాత్రలకు వెంట తీసుకెళ్లడం అమెరికా అధ్యక్షులకు అలవాటు. అయితే గతంలో ఇండియా వచ్చిన అధ్యక్షుల భార్యలు ఇండియాలో ఏం చేశారో తెలుసా.. ?

మొట్ట మొదటిసరి ఇండియాకు వచ్చిన అమెరికా అధ్యక్షుడి భార్య జాక్వెలైన్‌ కెన్నడీ. ఆమె 1962లో భారత్‌ను సందర్శించారు. అప్పుడు కెన్నడీ రాలేదు. అమెరికా మొదటి పౌరురాలు భారత్ కు రావడంతో ఇండియా అధినేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమె రాజస్థాన్‌లో ఒంటెపై సవారీ చేశారు. గంగా నదిలో పడవపై విహరించారు. ఇండియాలో ఎక్కువ కాలం గడిపిన అమెరికా అధ్యక్షుడి భార్యగా ఈమె రికార్డు సృష్టించారు. ఆ తర్వాత రిచర్డ్‌ నిక్సన్‌ భార్యాభర్తలు 1969లో ఇండియాకు వచ్చారు. వీరు ఒక్కరోజు మాత్రమే మనదేశంలో ఉన్నారు. ఇండియాలో అతి తక్కువ కాలం ఉన్న రికార్డు వీరిది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జిమ్మీకార్టర్‌ తో కలిసి 1978లో భారత్‌ సందర్శించిన రోజలిన్‌ ఇక్కడ రెండు రోజులున్నారు. దక్షిణ దిల్లీకి సమీపంలోని ఛుమా ఖేరాగావ్‌ను సందర్శించారు.

Image result for ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షుల భార్యలు

1995లో హిల్లరీ క్లింటన్‌ భారత్‌లో మూడు రోజులు ఉన్నారు. అప్పుడు భర్త బిల్‌ క్లింటన్‌ రాలేదు. కూతురు చెల్సియాతో కలిసి హిల్లరీ తాజ్‌మహల్‌ తో పాటు అనేక టూరిస్టు ప్లేసులకు వెళ్లారు. ఆ తర్వాత 1997లో కోల్‌కతాలో మదర్‌థెరెసా అంత్యక్రియలకు కూడా హిల్లరీ ఒంటరిగా వచ్చారు. 2006లో భారత్‌ వచ్చిన లారా బుష్‌ ఢిల్లీలో పర్యటించారు. ఓ పాఠశాలను, జీవన్‌జ్యోతి దివ్యాంగుల ఆశ్రమాన్నినోయిడాలోని ఫిల్మ్‌సిటీని సందర్శించారు. 2010లో ఒబామా తన భార్యతో కలిసి వచ్చాడు. ఒబామా రెండుసార్లు భారత్ లో పర్యటించారు. అయితే ఒకసారి మాత్రం ఒక్కడే వచ్చాడు. 2010లో ఒబామా మొదటిసారి భారత్ కు రాగా.. 2015లో మోడీ హయాంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రెండోసారి గెస్ట్ గా ఒబామా వచ్చారు. ఇక ఒబామాతో పాటు అయన భార్య మిషెల్ కూడా వచ్చారు. భర్తతో పాటు ఇండియా వచ్చిన మిషెల్‌ ఒబామా ముంబయిలోని ఓ పాఠశాలలో పిల్లలతో కలిసి ఆడిపాడారు. ఇలా అమెరికా అధినేతల భార్యలు ఇండియా వచ్చి కొన్ని కార్యక్రమాలలో పాల్గొని వెళ్లారు.

Content above bottom navigation