ఇలాంటి భార్య ఎవరికీ ఉండకూడదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ ..

128

అతనికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఆరు మంది భార్యలు ఉన్నారు. ప్రస్తుతం ఐదు మంది భార్యలతో కాపురం చేస్తున్నాడు. ఆరు మంది భార్యలకు పిల్లలు ఉన్నారు. ఇదంతా విని అతనిది పెద్ద కుటుంబమే అని అనిపిస్తుంది .కానీ చివరికి ఏం జరిగిందో తెలిస్తే..ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా ఏం లాభం అని అనిపిస్తుంది. మనం చనిపోతే మనల్ని మోయడానికి నలుగురు నా అన్నవాళ్ళు ఉండాలని అంటారు. ఇతనికి ఇంత పెద్ద కుటుంబం ఉన్నా కూడా ఛస్తే మోయడానికి ఒక్కరు కూడా రాలేదు. చివరికి అతని అంత్యక్రియల చెయ్యడానికి కుటుంబ సభ్యులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని అతని అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని బెలగావి జిల్లా చిక్కోడి సమీపంలోని ఇట్నాళ గ్రామంలో నివాసం ఉంటున్న ఈరప్ప నాయక్ (36) అనే వ్యక్తికి అందరూ ఉన్నా అనాధలాగా అంతిమసంస్కారాలు చేశారు. ఈరప్ప నాయక్ చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్నాడు. ఇతనికి ఆరు మంది భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భార్యకు ఒక కుమారుడు, మూడో భార్యకు ఇద్దరు, నాలుగు, ఐదు, ఆరో భార్యకు ఒక్కొక్కరు చొప్పన పిల్లలు ఉన్నారు. ఈరప్ప నాయక్ ఆరు మంది భార్యలతో వేరువేరుగా కాపురం చేస్తున్నాడు. మూడో భార్యకు మాత్రం ఇతను దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పటి వరకూ ఐదు మంది భార్యలతో ఇతను కాపురం చేస్తు వారితో కలిసి ఉంటున్నాడు. ఈనెల 20వ తేదీన బైక్ లో వెలుతున్న ఈరప్ప నాయక్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైనాయి. అతన్ని గోకాక్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సోమవారం ఈరప్ప నాయక్ మరణించాడు. ఆసుపత్రి వైద్యులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

ఆరు మంది భార్యలు ఉన్న ఈరప్ప నాయక్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని సమాచారం తెలుసుకున్న అతని భార్యల్లో ఒక్కరు కూడా ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం పిల్లలు, ఈరప్ప నాయక్ తల్లిదండ్రులు, సోదరులు సైతం అటు వైపు రాలేదు. రోడ్డు ప్రమాదంలో గాయాలై మరణించిన ఈరప్ప నాయక్ ఆసుపత్రి బిల్లు ఇంకా రూ. 60 వేలు పెండింగ్ ఉంది. అక్కడికి వెళితే ఆసుపత్రి బిల్లు చెల్లించాల్సి వస్తోందని అతని ఆరు మంది భార్యలు భయపడ్డారని సమాచారం. అందుకే కనీసం చనిపోయిన భర్తను చూడటానికి వాళ్లు రాలేదు. ఈరప్ప నాయక్ మృతదేహాన్ని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

ఒక్క భార్య కూడా కన్నెత్తి చూడలేదు

చివరికి ఎస్ ఐ గోపాల హళ్లూర గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. మన గ్రామం పరువు పోతుందని ఆందోళనతో గ్రామస్తులు అందరూ చందాలు వేసుకుని ఈరప్ప నాయక్ ఆసుపత్రి బిల్లు చెల్లించి మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకు వచ్చారు. ఈరప్ప నాయక్ చనిపోయాడని తెలుసుకున్న అతని ఆరు మంది భార్యలు సైతం కడసారి చూడటానికి రాలేదు. కనీసం వారి పిల్లలను పంపించలేదు. చివరికి గ్రామస్తులు అందరూ కలిసి ఈరప్ప నాయక్ అంత్యక్రియలు పూర్తి చేశారు. అందరూ ఉన్నా ఈరప్ప నాయక్ అనాథగానే పైలోకాలకు వెళ్లిపోయాడు. ఇంతమంది ఉన్నా కూడా అనాథలా అంత్యక్రియలు నిర్వహించడం అంటే కొంచెం బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

Content above bottom navigation