ఇవి పాటించకపోతే మీరు ఇంట్లో ఉన్నా కరోనా వస్తుంది….! ఈ 9 నియమాలు పాటిస్తే మనం సేఫ్

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే . దీంతో ప్రజలంతా అప్రమత్తమై వారి ఇళ్లలోనే ఉంటూ అత్యవసరమైన పరిస్థితిలో తప్ప బయటకు రావడం లేదు . పోలీసు వారు కూడా చాలా నిబద్ధతతో అనవసరంగా బయట కనిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉండడం చాలా ప్రశంసనీయం . అయితే తాము ఇళ్లలో ఉన్నాం కాబట్టి తమకు ఇక వైరస్ బెడద తప్పింది అని అనుకుంటే మాత్రం అది ముమ్మాటికీ పొరపాటే అవుతుంది .

ముఖ్యంగా చెప్పాలంటే బయట ఉన్న వారితో సమతూకంగా ఇంటిలో ఉన్న వాళ్లకు కూడా ఈ కరోనా మహమ్మారి సోకే ప్రమాదం పొంచి ఉంది . ప్రభుత్వాలు ప్రజలను బయటకు ఎందుకు రావద్దు అని అంటున్నారు అంటే బయట వైరస్ సోకిన వారి నుండి వారు నేరుగా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇది మరీ ఎక్కువ మందికి ఊరికే సోకే అవకాశం ఉన్నందున . అలా అని మీరు ఇంట్లో ఉన్నా కూడా ఈ వైరస్ బెడద నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు .అయితే ఈ తరుణంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి వైరస్ బారిన పడే చాన్సు అసలు లేదు . ఇంతకీ విషయం ఏమిటంటే ఇంటిలో ఉన్న సమయంలో నిత్యావసర వస్తువులు నిమిత్తం బయటికి వెళ్లి వచ్చిన తర్వాత మరియు ఇంటికి తెప్పించుకునే కొన్ని వస్తువుల ద్వారా వైరస్ సోకే అవకాశం ఉంది . ఇలాంటి నేపథ్యంలో దాని బారి నుండి తప్పించుకోవాలంటే పాటించాల్సిన సూచనల విషయానికి వస్తే…

Image result for మీరు ఇంట్లో ఉన్నా కరోనా వస్తుంది
  1. బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులను నేరుగా తాకకుండా చేతులకు శానిటైజర్ రాసుకుని పట్టుకోండి. అప్పుడు దానికి ఉన్న వైరస్ మీకు అంటదు.
  2. అలాగే పాల ప్యాకెట్లను , కూరగాయలను , ఫ్రూట్స్‌ని శుభ్రంగా కడిగిన తరువాత చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి. లేకుంటే కరోనా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు.
  3. ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న తరుణంలో దినపత్రికలను రద్దు చేయడం మంచింది. ఎందుకంటే ఒక న్యూస్ పేపర్ ఎంతోమంది చేతులు మారి వస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండటమే బెటర్.
  4. కొరియర్స్ , ఇతరత్రా వాటికి ఇంటి బయట ఒక ట్రే ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి.
  5. పని మనుషులకు నిర్భంద కాలం తప్పదు. ఎవరిని కూడా మీ ఇంటికి రానివ్వొద్దు. మీ ఇంటి పనులు మీరే చేసుకోండీ.
  6. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అసలే వద్దు. ఏదో ఒక వంటను ఇంట్లోనే చేసుకోవడం మంచిది.
  7. మొబైల్ ఫోన్లు , రిమోట్ కంట్రోల్ , కీ బోర్డ్స్ తరుచూ శుభ్రం చేసుకోవాలి. వాటిపై వైరస్ ఉండే ఛాన్స్ ఉంది.
  8. అత్యవసరంగా బయటకు వెళ్లి వస్తే .. వెంటనే స్నానం చేయాలి. రోజుకు రెండుసార్లు స్నానం చెయ్యడం మంచిది.
  9. ఇక వృద్ధులు ఈ కాలంలో వాకింగ్‌లకు వెళ్లకపోవడమే మంచిది. అలాగే చిన్నపిల్లలు బయటకు రాకుండా ఉండటం ఇంకా మంచిది.

ఇలా కొన్నిటిని జాగ్రత్తగా పాటించండి. లేకుంటే కరోనా మహమ్మారి నుంచి ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. కాబట్టి బీ కేర్ ఫుల్.

Content above bottom navigation