ఈ భవనంలో చనిపోవాలని ఎంతో మంది కోరుకుంటారు… ఎందుకో తెలిస్తే మీరు కూడా అక్కడే చావాలని అనుకుంటారు

189

మరణం అనేది ప్రతి ఒక్కరికీ సర్వ సాధారణం. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలీదు. అది వచ్చినప్పుడు ఎవరు కూడా ఉండరు. ఒంటరిగా ఎలా వచ్చామో, అలాగే ఒంటరిగా వెళ్ళిపోవాలి. అయితే కొంతమందికి చనిపోబోతాం అని ముందే తెలిస్తే అక్కడ చావాలి, ఇక్కడ చావాలి అని కొన్ని ప్లేస్ లను ఎంచుకుంటారు. అయితే ఎక్కువమంది మాత్రం ఒక భవనంలో మరణించాలని కోరుకుంటారు. ఇక్కడ చావు కోసం ఎదురు చూస్తుంటారు. అలా చావుకోసం ఆ భవనాన్ని ఎంచుకుంటున్నారు అంటే దానికి ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది అని అనిపిస్తుంది కదా.. మరి ఈ భవనం ప్రత్యేకత ఏంటో చూద్దామా.

Image result for varanasi moksha bhavan

ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర నగరం వారణాసి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు పవిత్ర నగరం. ఈ నగరంలో మరణిస్తే మోక్షం వస్తుందని ప్రతి హిందువు నమ్మకం. అందుకే దేశ వ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి తమ జీవిత కాలంలో చివరి రోజులను గడిపేందుకు వెళ్తుంటారు. అయితే అలా చనిపోడానికి ప్రతి హిందువు ఎంచుకునే భవనం ఒకటి ఉంది. అదే మోక్ష భవన్. ఒక పాత ఎర్ర భవనం లోపల ఉంటుంది ఈ మోక్ష భవన్. మరణం కోసం ఎదురు చూస్తున్న అనేక మంది ప్రజలతో కిటకిటలాడుతుంది. ఈ భవనం లోపల తక్కువ కాంతితో ఉన్న12 గదులు ఉంటాయి. అవసరమైన వస్తువులను మాత్రమే ఈ గదుల్లో ఉంచుతారు.

ఈ క్రింద వీడియో చూడండి:

ఈ గదుల్లో నివసించే ప్రజలు తాత్కాలికంగా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. దీని కోసం వారికి కేవలం 2 వారాల సమయం మాత్రమే ఉంటుంది. ఈ రెండు వారాల్లో వారికి చావు రాకపోతే వారిని మర్యాదగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతారు. మోక్ష భవన్ లో మరణం ఎవరికీ విరోధి కాదు. నిజానికి ప్రతి ఒక్కరూ తమ జీవితపు చివరి క్షణాల్లో తెలుసుకునే అంతిమ సత్యం ఇది. భూమిపై తాము జీవించే స్వల్ప జీవితంలో తుది విజయం సాధించాలనే ఆశతో, ప్రతి ఏటా వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. వారణాసిలో పవిత్రమైన గంగా నది ప్రవాహంకు సమీపంలో చనిపోవడం ఒక గౌరవంగా భక్తులు భావిస్తుంటారు. దీనికి మోక్ష భవన్ కంటే మంచి ప్రదేశం మరొకటి లేదని నమ్ముతారు.

Image result for varanasi moksha bhavan

1958లో ప్రముఖ పారిశ్రామిక వేత్త విష్ణు హరి దాల్మియా కాశీలో చనిపోవాలని కోరుకునే వారి కోసం ఈ మోక్ష భవన్ ను నిర్మించారు. ఈ భవనం యొక్క మేనేజర్ భైరవ్ నాథ్ శుక్లా 48 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల మోక్షం కోసం ప్రార్ధిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయే అవకాశం ఉందో లేదో ఆయన ముందే ఊహించగలడు. శుక్లా, అతని కుటుంబం నిత్యం మృతదేహాలు, వారి బంధువుల రోధనలకు అలవాటు పడింది. ఓ వైపు శుక్లా అక్కడ ఉన్న వారి మోక్షం కోసం ప్రార్ధిస్తుంటే, మరో వైపు ఆయన పిల్లలు ఆ సముదాయంలోనే ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. ఇక్కడ మరణం అంటే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఇక్కడ నివసించే చాలా మంది మోక్షాన్ని పొందగా, ఇతరులు మరణించలేక నిరాశతో వెనుతిరుగుతుంటారు. గంగా నది మెట్లపై మీరు ఎప్పుడు చూసినా మరణించిన వారి దేహాలు ఎప్పుడూ చితిపై కాలుతూ, బూడిద రంగు పొగ ఆకాశం మొత్తం అలముకుని కనిపిస్తుంది. వారణాసిని మరణం పొందే ప్రదేశంగా కాకుండా విముక్తి కల్పించే స్థలంగా, పాపాలను కడిగే పవిత్ర ప్రదేశంగా ప్రజలు భావిస్తారు. స్వచ్ఛతకు కేంద్రంగా, జీవితానికి కేంద్రంగా, భూమిపై ఎక్కడా కలగని విధంగా మరణం ఇక్కడ లభిస్తుందని నమ్ముతారు.

Content above bottom navigation