ఈ రాశుల వారికి ఎప్పటికీ జోడి కుదరదు..

154

”కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు” అని అంటారు. కొన్ని సందర్భాలలో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు, వారి మధ్య కెమిస్ట్రీ చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే ఈ విషయం వారిద్దరికీ తప్ప మిగతా వారికి తెలుస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలిస్తే, కొన్ని రాశుల వారి కలిసి ఉండేందుకు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే మరికొన్ని రాశుల వారు పాము, ముంగిస లాగా గొడవ పడతారంట. వీళ్ళు కలిసి ఉంటె జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశులకు జోడి అనేది అస్సలు కుదరదో ఇప్పుడు చూద్దాం..

 1. కుంభం, మకర రాశులు..
  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభం, మకర రాశులు పక్కపక్కనే ఉంటాయి. అయితే ఈ ఇద్దరు కలిస్తే ఈ రాశుల సహజ లక్షణాల కారణంగా ఎప్పుడు గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రాశుల వారు ఎక్కువగా విడిపోవడానికి ఆసక్తి చూపుతుంటారు. వీరిలో మకర రాశి వారు తరచుగా ఆధిపత్యం చెలాయించేందుకు డిమాండ్ చేయవచ్చు. ఇది కచ్చితంగా కుంభ రాశి వారికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కుంభ రాశి వారు స్వేచ్ఛ భావన అనే దానికి ఎంతో విలువ ఇస్తారు. అందుకే ఈ రెండు రాశుల మధ్య అనుబంధం దాదాపు అసాధ్యమని చెప్పొచ్చు.
 1. సింహ, కర్కాటక రాశులు..
  ఈ రెండు రాశుల వారు ప్రేమను పొందడానికి చాలా భిన్నమైన మార్గాలను కలిగి ఉంటారు. కర్కాటక రాశి వారు కుటుంబ ఆధారిత వ్యక్తులు. వీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, భావోద్వేగ స్థిరత్వం కోసం చూస్తారు. వీళ్ళు రిలేషన్ షిప్ ను పెంచేందుకు ప్రయత్నిస్తారు. అయితే సింహ రాశి వారికి ఇది అంత సులభం కాదు. వీరు అంత సులభంగా ప్రేమలో పడరు. ఎందుకంటే వీరు తమను తాము ఎంతగానో విలువైన వారుగా భావిస్తారు. అంతేకాదు ఈ రాశి వారు చాలా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు ఒకవేళ కర్కాటక రాశి వారితో ప్రేమలో పడితే, వీరిదే పైచేయి ఉండాలని భావిస్తారు. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి.
 1. కన్య, ధనస్సు రాశులు..
  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్య, ధనస్సు రాశుల వారిని ‘చదరపు కారకం‘ అని పిలుస్తారు.. ధనస్సు రాశి వారిని కన్య రాశి వారు సులభంగా చికాకు పరుస్తారు. వీరి సహజ ప్రవర్తన, సరసాల వంటి వాటితో సులభంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఈ రెండు రాశుల వారు ప్రేమలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు మరొకరు ఆధిపత్యం చెలాయించే ధోరణిని కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో ఇద్దరికీ ఒకే రకమైన శక్తి, స్థానం ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.
 2. మీన, సింహ రాశులు..
  ఈ రెండు రాశుల వారు 150 డిగ్రీల కోణంలో వేరువేరుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరిద్దరిది ‘అసంపూర్తి కారకం‘ అని పిలుస్తారు. మీన, సింహ రాశుల వారు ఒకరినొకరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ రెండు రాశుల వారి సంకేతాలు విరుద్ధమైనవి.. ఈ రెండు రాశుల వారి గుర్తులు ప్రతికూల మూలకాలకు చెందినవి. సింహ రాశి సంకేతం అగ్ని అయితే, మీన రాశి గుర్తు నీరు. అందుకే ఈ రెండు రాశుల వారు జీవిత సంబంధ విషయాలపై భిన్నమైన విధానాలను కలిగి ఉంటారు.

ఇలా కొన్ని రాశులవారు కొన్ని రాశుల వారిని పెళ్లి చేసుకోవడం కానీ, ప్రేమించడం కానీ చెయ్యకూడదు. చేస్తే ఇక మీ పని అంతే సంగతి.. కాబట్టి పెళ్లి చేసుకునే ముందు అవతల వారిది ఏ రాశో తెలుసుకుని పెళ్లి చేసుకోండి.

Content above bottom navigation