ఈ శివరాత్రి తర్వాత శివుని కృపతో ఈ 4 రాశుల వారు కుబేరులు కాబోతున్నారు… మీ రాశి ఉందేమో చూసుకోండి..

107

హిందువుల పవిత్ర పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీన శివరాత్రి పర్వదినం జరుపుకోబోతున్నాం. ఆ రోజున భక్తులు శివుణ్ణి భక్తి శ్రద్దలతో కొలుస్తారు. మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది. ఈ శివరాత్రి రోజు నుంచి శివుడు కొన్ని రాశులకు అద్భుతమైన యోగాన్ని కల్పించబోతున్నారు. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

Image result for మేష రాశి

మేష రాశి
ఈ రాశివారు ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటారు. వీరికి భక్తి అధికంగా ఉంటుంది. వీరు శివరాత్రి రోజు శివునికి పూజలు చేస్తారు. వీరికి పూజ చేయటం కుదరకపోయిన ఇంటిలోని వారితో అయినా పూజలు చేయిస్తారు. కానీ పూజ మాత్రం అసలు మానరు. భగవంతుడు అంతటా ఉన్నాడనే విశ్వాసం ఈ రాశివారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారు ఈ శివరాత్రి నుంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తి ప్రతిష్టలు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. వీరికి వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి. వాటిని సరైన సమయంలో ఉపయోగించుకుని సక్సెస్ అవుతారు. ఈ రాశివారు శివరాత్రి రోజు ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా పరమ శివుని కృప అపారంగా ఉంటుంది.

Image result for కర్కాటక రాశి

కర్కాటక రాశి
ఈ రాశివారు హిందూ సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారు. సంస్కృతి సంప్రదాయాలు మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళతాయనే నమ్మకం ఈ రాశివారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారికి దేవుని పట్ల భక్తి, శ్రద్ద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారిపై పరమశివుని కృప అపారంగా ఉంటుంది. ఈ రాశివారికి లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంది. కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వీరి జాతకం ఎలా ఉంటుంది అంటే ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. వీరు ఏదైనా పని అవ్వాలని అనుకుంటే ఆ పని అయ్యేంతవరకు అసలు వదలరు. అంత పట్టుదల వీరికి ఉంటుంది. శివరాత్రి రోజున కర్కాటక రాశివారు ఆవుకి ఆహారం అందించటం, ఆవుకి చేయగలిగిన సేవలు చేయటం చేస్తే పరం శివుని కృప ఈ రాశివారిపై ఉంటుంది. శివరాత్రి రోజున పూజ చేసి ఉపవాసం, జాగరణ చేస్తే శివుని కృప కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

Image result for కన్య రాశి

కన్య రాశి
ఈ రాశివారి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడరు. ఈ రాశివారు ఏది అనుకుంటే అదే మాట్లాడతారు. వీరికి క్షమా గుణం చాలా ఎక్కువ. క్రమశిక్షణగా ఉంటారు. వీరి మనస్సు చాలా విశాలమైనది. ఈ రాశివారిని ఎవరైనా సహాయం అడిగితే లేదని కాదని అనకుండా సహాయం చేస్తారు. ఈ రాశివారు చాలా మంచితనంతో ఉంటారు. ఈ రాశివారికి ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వీరికి తిరుగుండదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్య రాశివారు శివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేస్తే జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజున పూజ చేసి ఉపవాసం, జాగరణ చేస్తే శివుని కృప కలిగి ఉన్నత స్థితికి చేరుకుంటారు.

Image result for కుంభ రాశి

కుంభ రాశి
ఈ రాశివారికి దేవుని పట్ల భక్తి, భయం, నమ్మకం అన్ని ఉన్నా బయటకు అసలు కన్పించరు. వీరిని చుస్తే అసలు దేవుని పట్ల భక్తి ఉందని ఎవరు నమ్మరు. నలుగురిలో వీరి భక్తిని బయట పెట్టరు. వీరికి ఏదైనా ఒక దారి కనపడితే చాలు ఆ దారిని పట్టుకుని వెళ్ళిపోతారు. అనుకున్నది సాధిస్తారు. కాస్త ప్రోత్సాహం ఇస్తే చాలు ఏదైనా సాధిస్తారు. ఈ శివరాత్రి నుంచి ఈ రాశివారు ఏ పని చేసిన సరే సక్సెస్ అవుతుంది. ఇంట్లో పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.

శివుని కృప ఈ రాశివారిపై అపారంగా ఉంటుంది. శివరాత్రి రోజు ఈ రాశివారు శివునికి పూజ చేసి శివ అస్తోత్రాన్ని పఠించి, అభిషేకాలు చేసి, ఉపవాసం, జాగారణ చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇలా ఈ నాలుగు రాశుల వారికీ ఈ మహాశివరాత్రి నుంచి తిరుగుందంట. మరి మీ రాశి ఇందులో ఉందా? అయితే ఇక మీకు మంచి రోజులు వచ్చినట్టే.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation